‘కొవిడ్ మరణాలు మిస్ అయ్యే ఛాన్స్ లేదు’
న్యూఢిల్లీ: కొవిడ్ మరణాలు మిస్ అయ్యే అవకాశమే లేదని, మరణాలను రికార్డు చేసేందుకు పటిష్టమైన రిపోర్టింగ్ పద్దతిని అనుసరించామని కేంద్రం గురువారం వెల్లడించింది. దేశంలో కొవిడ్-19 మరణాల సంఖ్యను తప్పుగా లెక్కించారంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. అధికంగా కనిపిస్తున్న మరణాల సంఖ్యలను కొవిడ్-19 మరణాలుగా చూపిస్తూ మీడియాలో ప్రసారం చేస్తుండటాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. ఆ లెక్కలన్ని వాస్తవాల ఆధారంగా లేవని, పూర్తిగా తప్పుతోవ పట్టించేవిగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశంలో అత్యంత పటిష్టమైన కొవిడ్-19 […]
న్యూఢిల్లీ: కొవిడ్ మరణాలు మిస్ అయ్యే అవకాశమే లేదని, మరణాలను రికార్డు చేసేందుకు పటిష్టమైన రిపోర్టింగ్ పద్దతిని అనుసరించామని కేంద్రం గురువారం వెల్లడించింది. దేశంలో కొవిడ్-19 మరణాల సంఖ్యను తప్పుగా లెక్కించారంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. అధికంగా కనిపిస్తున్న మరణాల సంఖ్యలను కొవిడ్-19 మరణాలుగా చూపిస్తూ మీడియాలో ప్రసారం చేస్తుండటాన్ని ప్రభుత్వం తప్పుపట్టింది. ఆ లెక్కలన్ని వాస్తవాల ఆధారంగా లేవని, పూర్తిగా తప్పుతోవ పట్టించేవిగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశంలో అత్యంత పటిష్టమైన కొవిడ్-19 డెత్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఉందని కేంద్రం పేర్కొంది. ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ మేనెజ్‌మెంట్ సూత్రాల ప్రకారం కొన్ని కరోనా మరణాలు కేంద్రం దృష్టికి రాకపోయినప్పటికీ అవి రికార్డుల్లో నమోదు కాకుండా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇండియాలో కరోనా మరణాల సంఖ్య ప్రభుత్వ లెక్కలతో పోలిస్తే 49 లక్షల వరకు అధికంగా ఉండొచ్చని మంగళవారం అమెరికాకు చెందిన రీసెర్చ్ గ్రూప్- సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఓ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కాగా కరోనా మరణాలను దాచిపెడుతున్నారన్న వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ రాజ్యసభలో స్పందించారు. ‘నిత్యం కరోనా కేసుల, మరణాల నమోదులో కింద నుంచి పై శాఖలకు రిపోర్టింగ్ విధానాన్ని అనుసరించాము. దీని ప్రకారం జిల్లాల్లో నమోదైన కరోనా కేసులను జిల్లాలు రాష్ట్రానికి, కేంద్రానికి కంటిన్యూస్ ప్రాతిపదికన నివేదిస్తాయి. వాటిని మాత్రమే కేంద్రం సంగ్రహించి, ముద్రిస్తుంది. ఇదంతా రాష్ట్రాలు ఇచ్చే సమాచారం ఆధారంగానే ఉంటుంది’అని చెప్పారు. గతంలో మే 2020లో కరోనా మరణాల సంఖ్య నమోదులో రాష్ట్రాలకు కొంత అస్థిరత, కన్ఫ్యూజన్ తలెత్తింది. దీంతో కరోనా మరణాల సంఖ్యను సరిగ్గా నమోదు చేసేందుకు గాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ మార్గదర్శకాలను విడుదల చేసిందని కేంద్రం గుర్తు చేసింది. వీటి ఆధారంగా మాత్రమే కరోనా మరణాలను రిపోర్టు చేయాలని రాష్ట్రాలకు సూచిస్తున్నట్టు తెలిపారు.