Rajnath Singh : ఎయిర్ ఫోర్స్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ కీలక సందేశం
దిశ, నేషనల్ బ్యూరో : స్వదేశీ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ నిత్యం సర్వ సన్నద్ధంగా ఉండాలని భారత వాయుసేనకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) పిలుపునిచ్చారు.
దిశ, నేషనల్ బ్యూరో : స్వదేశీ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ నిత్యం సర్వ సన్నద్ధంగా ఉండాలని భారత వాయుసేనకు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) పిలుపునిచ్చారు. దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో వాయుసేన(Indian Air Force) పాత్ర అత్యంత కీలకమైందని ఆయన కొనియాడారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఎయిర్ ఫోర్స్ కమాండర్ల సదస్సులో రాజ్‌నాథ్ ప్రసంగించారు. రక్షణ రంగంలో భారత్ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు ‘ఆత్మనిర్భరత’కు మోడీ సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు.
దేశ భద్రతా అవసరాలను తీర్చగలిగేలా వాయుసేన శక్తి సామర్థ్యాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తకొత్త సవాళ్లకు అనుగుణంగా భారత వాయుసేన అత్యాధునిక సైనిక సాంకేతికతతో ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ సదస్సు సందర్భంగా భారత త్రివిధ దళాలు కలిసికట్టుగా పనిచేసే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో వాయుసేన అధిపతి ఏపీ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి ఆర్‌కే సింగ్, డీఆర్‌డీఓ ఛైర్మన్ ఎస్.వి.కామత్, రక్షణ ఉత్పత్తుల విభాగం కార్యదర్శి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.