Maharashtra Exit Polls: మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ విడుదల.. అధికారం ఆ కూటమిదే!
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర మంత్రులు సహా బీజేపీ (BJP) సీనియర్ నేతలు జోరుగా ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ (Congress) అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)తో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కూడా ఎన్నికల ర్యాలీల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మరాఠావాసులు ఎలాంటి తీర్పును ఇవ్వబోతున్నారనే విషయంలో సస్పెన్స్ వీడింది.
తాజాగా, పీపుల్స్ పల్స్ (People's Pulse) సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్ర (Maharashtra)లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ (BJP) సారథ్యంలోని మహాయుతి (Mahayuthi) కూటమి 182 స్థానాలను కైవనం చేసుకుంటుందని తెలిపింది. ఇక కాంగ్రెస్ (Congress) సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ (Maha Vikas Aghadi) 97 స్థానాలు, ఇతరులు 9 స్థానాలను విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్‌లో వెల్లడైంది. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు కాగా.. మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్‌లో స్పష్టమైంది.