రిక్షాలో కరోనా మృతదేహం తరలింపు..

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా బారిన పడి మృతిచెందిన వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. ఈ హృదయవిదారకమైన ఘటన గుంటూరు జిల్లాలోని బాపట్లలో బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం మృతదేహాన్ని ఫుల్‌గా ప్యాక్ చేసి, అంబులెన్స్‌లో సిబ్బంది పర్యవేక్షణలో తరలించాలి. కానీ, అందుకు విరుద్ధంగా రిక్షాలో తరలించడం వలన ఆ వైరస్ ఇతరులకు […]

Update: 2020-08-12 11:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా బారిన పడి మృతిచెందిన వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. ఈ హృదయవిదారకమైన ఘటన గుంటూరు జిల్లాలోని బాపట్లలో బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం మృతదేహాన్ని ఫుల్‌గా ప్యాక్ చేసి, అంబులెన్స్‌లో సిబ్బంది పర్యవేక్షణలో తరలించాలి. కానీ, అందుకు విరుద్ధంగా రిక్షాలో తరలించడం వలన ఆ వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేకపోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రి సిబ్బంది మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంటనీ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News