లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: కరోనా పరీక్షల నిర్వహణకు అనుసరించిన స్ట్రాటజీని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) మార్చింది. దేశంలో కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలని తాజాగా టెస్టింగ్ వ్యూహాన్ని సవరించింది. హాస్పిటళ్లు, కంటైన్‌మెంట్ జోన్లు, హాట్‌స్పాట్లలలో కరోనా లక్షణాలున్న వ్యక్తికి, కరోనా పేషెంట్ కాంటాక్టు, అంతర్జాతీయ ప్రయాణం చేసినవారు, ఆరోగ్య సిబ్బందిలో ఈ వైరస్ లక్షణాలున్నవారికే టెస్టులు నిర్వహించే వ్యూహాన్ని మే 18వరకు ఐసీఎంఆర్ అనుసరించింది. ఎటువంటి కండీషన్స్ లేకుండా లక్షణాలున్న […]
న్యూఢిల్లీ: కరోనా పరీక్షల నిర్వహణకు అనుసరించిన స్ట్రాటజీని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) మార్చింది. దేశంలో కరోనా వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలని తాజాగా టెస్టింగ్ వ్యూహాన్ని సవరించింది. హాస్పిటళ్లు, కంటైన్‌మెంట్ జోన్లు, హాట్‌స్పాట్లలలో కరోనా లక్షణాలున్న వ్యక్తికి, కరోనా పేషెంట్ కాంటాక్టు, అంతర్జాతీయ ప్రయాణం చేసినవారు, ఆరోగ్య సిబ్బందిలో ఈ వైరస్ లక్షణాలున్నవారికే టెస్టులు నిర్వహించే వ్యూహాన్ని మే 18వరకు ఐసీఎంఆర్ అనుసరించింది. ఎటువంటి కండీషన్స్ లేకుండా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్ ఆదేశించడం ఇది తొలిసారి అని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే మార్గం ద్వారానే కరోనాకు అడ్డుకట్ట వేయగలమని, ఇందులో టెస్టులను చాలా మందికి అందుబాటులోకి తీసుకురావడం కీలకమని ఐసీఎంఆర్ పేర్కొంది. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ టెస్టు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అటువైగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ టెస్టులతోపాటు సర్వెలెన్స్‌కు ఉపయోగపడేలా యాంటీబాడీ టెస్టులనూ నిర్వహించాలని ప్రైవేట్ హాస్పిటళ్లు, కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను కోరింది.