వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ అధికం : మదర్సన్ సుమీ!
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 మహమ్మారి వ్యక్తిగత వాహనాల పాత్రను స్పష్టంగా ముందుకు తెచ్చిందనీ.. ఇందులో భాగంగా షేరింగ్ ప్రయాణాలను తగ్గించడమే కాకుండా, అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న ఆశలను తగ్గిస్తుందని ఆటో కాంపొనెంట్ దిగ్గజ సంస్థ మదర్సన్ సుమీ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్ వివేక్ చాంద్ వెల్లడించారు. కోవిడ్-19 ఆంక్షల తర్వాత వివిధ దేశాల్లో కార్యకలాపాలు తెరిచినపుడు వ్యక్తిగత వాహనాల డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, భారత్ లాంటి దేశాల్లో సాంప్రదాయ ఆటోమోటివ్ పరిశ్రమకు ఉజ్వలమైన భవిష్యత్తు […]
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 మహమ్మారి వ్యక్తిగత వాహనాల పాత్రను స్పష్టంగా ముందుకు తెచ్చిందనీ.. ఇందులో భాగంగా షేరింగ్ ప్రయాణాలను తగ్గించడమే కాకుండా, అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న ఆశలను తగ్గిస్తుందని ఆటో కాంపొనెంట్ దిగ్గజ సంస్థ మదర్సన్ సుమీ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్ వివేక్ చాంద్ వెల్లడించారు. కోవిడ్-19 ఆంక్షల తర్వాత వివిధ దేశాల్లో కార్యకలాపాలు తెరిచినపుడు వ్యక్తిగత వాహనాల డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, భారత్ లాంటి దేశాల్లో సాంప్రదాయ ఆటోమోటివ్ పరిశ్రమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కోవిడ్-19 వ్యాప్తి తర్వాత వినియోగం కోసం ప్రైవేట్ వాహనాల పాత్ర పెరిగిందని పేర్కొన్నారు. కరోనా తగ్గిన తర్వాత చైనా, జపాన్, కొరియా దేశాల్లో వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిందన్నారు. భారత్‌లోనూ అలాంటి పరిస్థితి చూడగలమని ఆయన వివరించారు. రాబోయే రెండేళ్ల వరకు ఆటో పరిశ్రమపై కరోనా ప్రభావం ఎలా ఉండబోతోందనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలు పర్యటనలకు, బయటకు వెళ్లాలనుకునే వారు పెరుగుతారని. ఈ పరిణామం చాలా ముఖ్యమనీ ఆ సమయంలో వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ మరింత పెరగవచ్చని మదర్సన్ సుమీ తెలిపింది. దాన్ని ఎదుర్కొనే సమర్థతను పరిశ్రమలు అందిపుచ్చుకోవాలని సంస్థ పేర్కొంది.