2009 స్థాయికి తగ్గిన బంగారం దిగుమతులు!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో డిమాండ్, సరఫరా దెబ్బతినడంతో 2020లో భారత్‌కు బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లలో రెండో స్థానంలో ఉన్న భారత్ స్థానికంగా బంగారం ధరలు ఎక్కువగా ఉండటం, కరోనా ప్రభావంతో కొనుగోళు తగ్గాయి. గతేడాది విదేశాల నుంచి 275.5 టన్నుల మేర బంగారం దిగుమతులు క్షీణించాయి. ఇది 2009 తర్వాత ఈ స్థాయిలో బంగారం దిగుమతులు తగ్గడం ఇదే తొలి సారని ప్రపంచ బంగారం మండలి(డబ్ల్యూజీసీ) గణాంకాలు తెలిపాయి. […]

Update: 2021-01-05 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో డిమాండ్, సరఫరా దెబ్బతినడంతో 2020లో భారత్‌కు బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లలో రెండో స్థానంలో ఉన్న భారత్ స్థానికంగా బంగారం ధరలు ఎక్కువగా ఉండటం, కరోనా ప్రభావంతో కొనుగోళు తగ్గాయి. గతేడాది విదేశాల నుంచి 275.5 టన్నుల మేర బంగారం దిగుమతులు క్షీణించాయి. ఇది 2009 తర్వాత ఈ స్థాయిలో బంగారం దిగుమతులు తగ్గడం ఇదే తొలి సారని ప్రపంచ బంగారం మండలి(డబ్ల్యూజీసీ) గణాంకాలు తెలిపాయి.

అయితే, ఏడాది చివరి నెల డిసెంబర్‌లో బంగారం దిగుమతులు 18 శాతం పెరిగి 55.4 టన్నులుగా నమోదైందని డబ్ల్యూజీసీ తెలిపింది. గతేడాది కరోనా ఉండటంతో లాక్‌డౌన్, ఈక్విటీ మార్కెట్ల పతనంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో వరుసగా రెండో ఏడాది బంగారం దిగుమతులు క్షీణించాయి. ఈ క్రమంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత రిటైల్ విక్యాలు మెరుగ్గా ఉన్నాయని, రీసైక్లింగ్‌తో పాటు కొత్తగా బంగారం కొనే వారు పెరిగాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ఛైర్మన్ ఆశీష్ పేథ్ చెప్పారు.

 

Tags:    

Similar News