గూగుల్ మ్యాప్స్‌లో కొవిడ్ ఫీచర్లు
కొవిడ్-19 జీవితంలో భాగమయ్యాక దాదాపు ప్రధాన యాప్‌లన్నీ కూడా కొవిడ్ పరిస్థితులకు అనుగుణంగా మారిపోతున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్ తమ కొత్త అప్‌డేట్‌లో కొవిడ్ ట్రాకర్ ప్రవేశపెట్టబోతోందని ‘దిశ’ కథనంలో చదివాం. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ కూడా ఇప్పుడు అదే కోవలో పయనిస్తోంది. త్వరలో తమ గూగుల్ మ్యాప్స్ యాప్‌లో కొవిడ్ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొవిడ్ 19 సంబంధిత ప్రయాణ నిబంధనలున్న విషయాలను ముందే యాప్‌లో చూపించడం ద్వారా వినియోగదారులు […]
కొవిడ్-19 జీవితంలో భాగమయ్యాక దాదాపు ప్రధాన యాప్‌లన్నీ కూడా కొవిడ్ పరిస్థితులకు అనుగుణంగా మారిపోతున్నాయి. ఇటీవల ఫేస్‌బుక్ తమ కొత్త అప్‌డేట్‌లో కొవిడ్ ట్రాకర్ ప్రవేశపెట్టబోతోందని ‘దిశ’ కథనంలో చదివాం. గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ కూడా ఇప్పుడు అదే కోవలో పయనిస్తోంది. త్వరలో తమ గూగుల్ మ్యాప్స్ యాప్‌లో కొవిడ్ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొవిడ్ 19 సంబంధిత ప్రయాణ నిబంధనలున్న విషయాలను ముందే యాప్‌లో చూపించడం ద్వారా వినియోగదారులు తమ ప్రయాణాలను చక్కగా ప్లాన్ చేసుకునే సదుపాయం కల్పించనుంది.
గతంలో చూపించినట్లుగా ట్రైన్ టైమింగ్స్‌తోపాటు ఏ ట్రైన్ ఎంత రద్దీగా ఉందనే విషయాన్ని కూడా మ్యాప్స్‌లో చూపించనున్నారు. ప్రస్తుతానికి ఈ ట్రాన్సిట్ అలర్ట్ ఫీచర్‌ను అర్జంటీనా, ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, మెక్సికో దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తమ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద కొవిడ్ నిషేధాజ్ఞాల గురించి కూడా ఈ అలర్ట్ అప్‌డేట్ చేస్తుంది.