‘కోవాగ్జిన్’ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ‘కోవాగ్జిన్’ మూడో దశ ట్రయల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 25 సైట్‌లలో 26వేల మంది వాలంటీర్లపై ఈ దశ ప్రయోగాలు జరగనున్నట్టు భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల ప్రకటించారు. దీంతో మూడో దశ ట్రయల్స్‌లోకి వెళ్లిన తొలి దేశీయ టీకాగా కోవాగ్జిన్ నిలవనుంది. మనదేశంలో అత్యధిక మందితో ట్రయల్స్ నిర్వహించనున్న టీకాగానూ రికార్డులకెక్కింది. మూడో దశ ట్రయల్స్ కోసం […]
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ‘కోవాగ్జిన్’ మూడో దశ ట్రయల్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 25 సైట్‌లలో 26వేల మంది వాలంటీర్లపై ఈ దశ ప్రయోగాలు జరగనున్నట్టు భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల ప్రకటించారు. దీంతో మూడో దశ ట్రయల్స్‌లోకి వెళ్లిన తొలి దేశీయ టీకాగా కోవాగ్జిన్ నిలవనుంది. మనదేశంలో అత్యధిక మందితో ట్రయల్స్ నిర్వహించనున్న టీకాగానూ రికార్డులకెక్కింది. మూడో దశ ట్రయల్స్ కోసం త్వరలోనే 25 వేదికల్లో 26 వేల మంది వాలంటీర్ల పేర్లను నమోదు చేయనున్నారు. వాలంటీర్లుగా నమోదుచేసుకోవడానికి కనీస వయసు 18ఏళ్లు నిండి ఉండాలి.
ఈ ట్రయల్స్‌లో భాగంగా ఆరు మైక్రోగ్రాములు డోసును 28 రోజు వ్యవధితో రెండుసార్లు ఇస్తారు. ప్లేస్‌బోనూ ర్యాండమ్‌గానే వేస్తారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యి మందిపై కోవాగ్జిన్ టీకా తొలి, రెండో దశ ట్రయల్స్‌ను నిర్వహించారు. ఈ ప్రయోగాలు ఫలితాలు ఆశాజనకంగా కనిపించడంతో భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ వీసీ తారీఖ్ మన్సూర్ బుధవారం తొలి వాలంటీర్‌గా నమోదైన సంగతి తెలిసిందే.
బయోలాజికల్ ఈ లిమిటెడ్ ట్రయల్స్ స్టార్ట్:
బయోలాజికల్ ఈ లిమిటెడ్ అమెరికా ఫార్మా సంస్థ డైనావాక్స్, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్(బీసీఎం)లతో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా తొలి, రెండు దశ ట్రయల్స్ ప్రారంభించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఈ ట్రయల్స్ ప్రారంభించింది. టీకా సేఫ్టీ, కరోనా నిరోధకతను వెల్లడించే ఈ ట్రయల్స్ ఫలితాలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సమీక్షించే అవకాశమున్నట్టు హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ తెలిపింది. ఈ ట్రయల్స్ కోసం 18 నుంచి 65ఏళ్ల వయస్సుగల 360 మంది వాలంటీర్లను నియమించుకోనున్నారు. 28 రోజుల కాల వ్యవధితో రెండు డోసులను వాలంటీర్లకు ఇవ్వనున్నారు. తాము అభివృద్ధి చేస్తున్న టీకా కరోనాను నిలువరించడానికి మరో అవకాశాన్ని ప్రపంచానికి అందిస్తుందని బయోలాజికల్ ఈ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల పేర్కొన్నారు.