ఉరి దండ.. ఆ నిబంధనలే అండ

        ఢిల్లీ జైలు చట్టం సెక్షన్ 836 ప్రకారం… ఒకే కేసులో ఒకే రకమైన శిక్ష పడి కోర్టు లేదా రాష్ట్రపతి దగ్గర ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా మిగతా దోషులకూ శిక్షను అమలు చేయకూడదు. సుప్పీంకోర్టు తీర్పు.. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించిన నుంచి ఉరి అమలుకు మధ్య 14 రోజుల సమయం ఉండాలి. ఈ రెండు నిబంధనలే ‘నిర్భయ’ దోషులకు అండగా నిలుస్తున్నాయి. ఉరిశిక్ష అమలు వాయిదాకు కారణమవుతున్నాయి. […]

Update: 2020-01-31 23:04 GMT

ఢిల్లీ జైలు చట్టం సెక్షన్ 836 ప్రకారం… ఒకే కేసులో ఒకే రకమైన శిక్ష పడి కోర్టు లేదా రాష్ట్రపతి దగ్గర ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా మిగతా దోషులకూ శిక్షను అమలు చేయకూడదు.
సుప్పీంకోర్టు తీర్పు.. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించిన నుంచి ఉరి అమలుకు మధ్య 14 రోజుల సమయం ఉండాలి.
ఈ రెండు నిబంధనలే ‘నిర్భయ’ దోషులకు అండగా నిలుస్తున్నాయి. ఉరిశిక్ష అమలు వాయిదాకు కారణమవుతున్నాయి. వీలైనంత ఎక్కవ కాలం ఉరిని తప్పించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. రకరకాల పిటిష్లను దాఖలు చేయడానికి దోహదం చేస్తున్నాయి. కింది కోర్టులు విధించిన ఉరిశిక్షను 2017, మేలో సుప్రీంకోర్టు ఖరారు చేసింది. ఇక అప్పటి నుంచి ఉరి వాయిదాకు పన్నాగం పన్నిన నలుగురు దోషులు కేసులు వేస్తూ వస్తున్నారు. జైలు నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని ఆటాడుకుంటున్నారు.
రెండు నెలలుగా డ్రామా
2019, డిసెంబర్ 6.. ముకేశ్‌సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి దగ్గరకు వచ్చింది.
డిసెంబర్ 10.. సుప్రీంకోర్టులో అక్షయ్‌ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
డిసెంబర్ 13.. దోషులకు డెత్ వారెంట్ జారీ చేయాలని పటియాలా హౌస్‌కోర్టులో ‘నిర్భయ’ తల్లి ఆశాదేవి పిటిషన్ దాఖలు చేశారు.
డిసెంబర్ 18.. అక్షయ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
డిసెంబర్ 19.. నేరం జరిగినప్పుడు తాను మైనర్‌ అని పవన్‌‌కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది.
2020, జనవరి 7.. పటియాలా హౌస్‌కోర్టు డెత్ వారెంట్ జారీ. జనవరి 22న ఉదయం 7గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఆదేశం.
జనవరి 14.. వినయ్‌కుమార్, ముకేశ్‌ సింగ్ రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
జనవరి 15.. నలుగురు దోషుల్లో ఒకరి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నందున ఉరి వాయిదా
జనవరి 17.. ముకేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
జనవరి 25.. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ముకేశ్‌ పిటిషన్ దాఖలు
జనవరి 29.. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన అక్షయ్‌కుమార్.
ఇదేరోజు ముకేశ్ సింగ్ రివ్యూ పిటిషన్‌ను సుప్పీంకోర్టు కొట్టి వేసింది.
జనవరి 30.. అక్షయ్‌కుమార్ సింగ్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
జనవరి 31.. మైనర్‌నని పేర్కొంటూ పవన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఇదే రోజు… రాష్ట్రపతిని వినయ్‌శర్మ క్షమాభిక్ష పెండింగ్‌లో ఉండటంతో ఉరిని వాయిదా వేస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది.
ముగ్గురికి న్యాయపరమైన అవకాశాలు
ముకేశ్ సింగ్: న్యాపరంగా అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. సుప్రీంకోర్టులో రివ్యూ, క్యురేటివ్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాడు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది.
వినయ్‌శర్మ: రివ్యూ, క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాడు. ఇంకా నిర్ణయం వెలువడలేదు.
అక్షయ్ ఠాకూర్: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాడు.
పవన్‌గుప్తా: ఎలాంటి న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోలేదు. సుప్రీంకోర్టులో రివ్యూ, క్యురేటివ్, రాష్ట్రపతి క్షమాభిక్ష తదితర పిటిషన్లు దాఖలు చేయడానికి ఆస్కారం ఉంది.

Tags:    

Similar News