స్పేస్ సూట్‌తో బ్రెజిల్ వీధుల్లో షికారు
న్యూఢిల్లీ: అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులున్న బ్రెజిల్‌లో ఇద్దరు దంపతులు కొవిడ్ 19 నుంచి రక్షణ పొందేందుకు అనూహ్యంగా ఆలోచించారు. వాళ్లు మాస్కులతో సరిపెట్టుకోలేదు. ఒక అడుగు కాదు, ఒక మైలు ముందుకెళ్లి ఏకంగా స్పేస్ సూట్(వ్యోమగాములు అంతరిక్షంలో వేసుకునేవి)లనే ధరించి షికారు చేశారు. బ్రెజిల్‌లోని రియోడి జెనీరోలో రోడ్లపై దంపతులు టెర్సియో గాల్డినో, అలేషియా లీమాలు స్పేస్ సూట్ ధరించి నడుస్తుంటే చూపరులు ఆసక్తిగా తిలకించారు. ఫొటోలు, వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు […]
న్యూఢిల్లీ: అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులున్న బ్రెజిల్‌లో ఇద్దరు దంపతులు కొవిడ్ 19 నుంచి రక్షణ పొందేందుకు అనూహ్యంగా ఆలోచించారు. వాళ్లు మాస్కులతో సరిపెట్టుకోలేదు. ఒక అడుగు కాదు, ఒక మైలు ముందుకెళ్లి ఏకంగా స్పేస్ సూట్(వ్యోమగాములు అంతరిక్షంలో వేసుకునేవి)లనే ధరించి షికారు చేశారు. బ్రెజిల్‌లోని రియోడి జెనీరోలో రోడ్లపై దంపతులు టెర్సియో గాల్డినో, అలేషియా లీమాలు స్పేస్ సూట్ ధరించి నడుస్తుంటే చూపరులు ఆసక్తిగా తిలకించారు. ఫొటోలు, వీడియోలు తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సూట్లను 66 ఏళ్ల గాల్డినో ప్రత్యేకంగా కొనుగోలు చేశారు. హెల్మెట్లు స్వయంగా తయారుచేసుకున్నారు. తొలుత వీటిని ధరించి వీధుల్లో నడవడానికి తన సహచరి వెనుకాడినా, ఇప్పుడు తనతో కలిసి నడుస్తున్నదని గాల్డినో వివరించారు.