లాక్ డౌన్ ఎఫెక్ట్.. రాష్ట్రాల సరిహద్దులో పెళ్లి..
తిరువనంతపురం : పెళ్లంటే నూరేళ్ల పంట.. అలాంటి వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతి జంట కలలు కంటోంది. పెళ్లి పందిరిలో పచ్చటి తోరణాల మధ్య.. బంధువుల సమక్షంలో.. పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. మంత్రోచ్ఛరణాల మధ్య మూడు ముళ్ల బంధంతో.. ఏడుడగులు వేసి ఒక్కటవ్వాలని తాపత్రాయం చెందుతుంటారు. కానీ, లాక్ డౌన్ పుణ్యమా అని, అవేవీ సాధ్యం కావడం లేదు. ఓ జంట రాష్ట్రాల సరిహద్దుల్లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తమిళనాడుకు చెందిన రాబిన్ సన్, […]
తిరువనంతపురం : పెళ్లంటే నూరేళ్ల పంట.. అలాంటి వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ప్రతి జంట కలలు కంటోంది. పెళ్లి పందిరిలో పచ్చటి తోరణాల మధ్య.. బంధువుల సమక్షంలో.. పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. మంత్రోచ్ఛరణాల మధ్య మూడు ముళ్ల బంధంతో.. ఏడుడగులు వేసి ఒక్కటవ్వాలని తాపత్రాయం చెందుతుంటారు. కానీ, లాక్ డౌన్ పుణ్యమా అని, అవేవీ సాధ్యం కావడం లేదు. ఓ జంట రాష్ట్రాల సరిహద్దుల్లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
తమిళనాడుకు చెందిన రాబిన్ సన్, కేరళ యువతి ప్రియాంకను ఈ ఏడాది మార్చి 22న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అంతలోనే జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ అమలు కావడంతో వారి వివాహం ఆగిపోయింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాలు అనుకున్నాయి. కానీ, లాక్ డౌన్ పొడిగింపు కొనసాగుతూ వస్తోంది. దీంతో.. రాష్ట్రాల సరిహద్దులో పెళ్లి చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు.
మొత్తానికి ఈ జంట.. వివాహం చేసుకునేందుకు తమ రాష్ట్రాల అధికారుల నుంచి అనుమతి పొందారు. తమిళనాడు – కేరళ సరిహద్దులోని చిన్నార్ బ్రిడ్జి వద్దకు జూన్ 7న ఉదయం 8 గంటలకు చేరుకున్నారు. వరుడు ఒక్కడే వధువు వద్దకు వెళ్లి తాళి కట్టాడు. ఇద్దరు దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. మిగతా బంధువులందరూ భౌతిక దూరం పాటించి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధువు ఒక్కతే వరుడి నివాసానికి వెళ్లింది. ఈ వివాహ వేడుకలో రాష్ర్టాల సరిహద్దుల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.