విశాఖలో నకిలీ యూరో కరెన్సీ ముఠా అరెస్ట్
దిశ, విశాఖపట్నం: విశాఖ నగరంలోని నకిలీ కరెన్సీ పేరిట మోసాలు అధికమైపోతున్నాయి. విదేశాల్లో చలామణిలో లేని చిత్తునోట్లను విశాఖ మీదుగా రవాణా చేస్తూ అందినకాడికి దండుకునే ముఠాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా మంగళవారం విశాఖలో యూరో కరెన్సీ మార్పిడి చేస్తున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి విశాఖ ఈస్ట్ ఏసీపీ హర్షిత తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన నలుగురు, చిత్తూరుకు చెందిన ఒకరు ముఠాగా […]
దిశ, విశాఖపట్నం: విశాఖ నగరంలోని నకిలీ కరెన్సీ పేరిట మోసాలు అధికమైపోతున్నాయి. విదేశాల్లో చలామణిలో లేని చిత్తునోట్లను విశాఖ మీదుగా రవాణా చేస్తూ అందినకాడికి దండుకునే ముఠాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. తాజాగా మంగళవారం విశాఖలో యూరో కరెన్సీ మార్పిడి చేస్తున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి విశాఖ ఈస్ట్ ఏసీపీ హర్షిత తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.
రాజమహేంద్రవరానికి చెందిన నలుగురు, చిత్తూరుకు చెందిన ఒకరు ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీ మార్పిడి చేస్తున్నారు. వీరు నగరంలోని డైమండ్ పార్కు వద్ద ఓ హోటల్‌లో బసకు దిగి అక్రమాలకు పాల్పడుతున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిఘా పెంచడంతో వారి సమాచారం అందింది. కస్టమర్ల మాదిరి హోటల్ కు వెళ్లిన వారితో నిందితులు బేరాలు ఆడారు. తమ వద్ద రూ.10కోట్ల విలువైన యూరోకరెన్సీ ఉందని, తమకు కేవలం కోటిన్నర ఇస్తే ఆ కర్సెనీని ఇచ్చేస్తామని నిందితులు చెప్పారు. వెంటనే వారిపై రైడ్ చేసి నలుగుర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఏసీపీ హర్షిత చెప్పారు. ఈ కేసులో నాల్గొవ పట్టణ సిఐ ఎ.ప్రేమ్‌కుమార్, సిబ్బంది చాకచాక్యంగా వ్యవహరించారని ప్రశంసించారు.