తేమ పేరుతో పత్తి రైతుల దోపిడీ!

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర ఇచ్చే విషయంలో ఇస్తున్న హామీలు బుట్టదాఖలవుతున్నాయి. మద్దతు ఇచ్చే విషయంలో రాజీ పడబోమని చెప్పే అ ధికార యంత్రాంగం రైతన్నను అడుగడుగునా మోసం చేసే ప్ర యత్నాలే చేస్తోంది. పత్తి కొనుగోళ్ల సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర విషయంలో వ్యాపారులు అక్రమాల పరంపరకు ప్రణాళిక రచిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. తేమ పేరుతో దోపిడీకి రంగం […]

Update: 2020-11-06 03:12 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర ఇచ్చే విషయంలో ఇస్తున్న హామీలు బుట్టదాఖలవుతున్నాయి. మద్దతు ఇచ్చే విషయంలో రాజీ పడబోమని చెప్పే అ ధికార యంత్రాంగం రైతన్నను అడుగడుగునా మోసం చేసే ప్ర యత్నాలే చేస్తోంది. పత్తి కొనుగోళ్ల సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర విషయంలో వ్యాపారులు అక్రమాల పరంపరకు ప్రణాళిక రచిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

తేమ పేరుతో దోపిడీకి రంగం సిద్ధం..

పత్తి కొనుగోళ్ల సీజన్ ప్రారంభమైంది. కేంద్రం నిర్ణయించిన మే రకు క్వింటాలు పత్తి రూ. 5,825 తో కొనుగోలు చేయాల్సి ఉం ది. ఇది నిజంగా అమలైతే రైతాంగానికి ఆశించిన పరిణామమే. కానీ, వ్యాపారులు ఈ ధరతో కొనుగోలు చేయరన్న అభిప్రాయా లు వ్యక్తం మవుతున్నాయి. ఒకవేళ ప్రైవేట్ వ్యాపారులు కొనుగో లు చేయకపోతే ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కొనుగోలు చేయాలి. అయితే ఇక్కడే వ్యాపారులు, అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ కు తీసుకువచ్చే పత్తి తేమ ఎనిమిది శాతం లో గా ఉండాలని అధికారులు చెబుతున్నారు. 8 నుంచి 12 శా తం వరకు పత్తిలో తేమ ఉన్నట్లయితే ప్రతి క్వింటాలుకు రూ. 50 చొప్పున కొనుగోలుదారులు కోత విధించేందుకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. దీంతో వ్యాపారులు తమ వద్దకు వచ్చే పత్తిని పరిశీలించి తేమ ఎక్కువగా ఉందంటూ రైతులను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. సీసీఐతో కుమ్మక్కయ్యే వ్యాపారులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తేమ పేరుతో రైతుల నుంచి పత్తి కొనుగోలుకు నిరాకరిస్తే అక్కడికక్కడే వ్యాపారులు రంగ ప్రవేశం చేసే కొనే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. ఇక రైతులు కూడా చేసేదేమీ లేక వ్యాపారులకు అమ్మే పరిస్థితి తలెత్తుతుంది. ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్​గా ఏర్పడి రైతుల నుంచి తక్కువ ధరతో పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు రైతు వర్గాల్లో ఉంది.

కొనుగోలు తర్వాత సీసీఐకి.!

రైతులను ఆదుకునేందుకు సీసీఐ ముందుంటుందని, ప్రతి ఏటా కొనుగోళ్ల సందర్భంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు చె ప్ప డం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా సీసీఐ నాణ్యమైన క్వింటాలు పత్తికి రూ.5,825 ధర పెట్టి కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. అయితే తేమ పేరుతో సీసీఐ యంత్రాంగం కొనుగోళ్లకు నిరాకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రైతులు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వ్యా పారుల వద్దకు వెళ్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి.

చర్యలు తీసుకోకపోతే రైతుకు నష్టం..!

పత్తి కొనుగోళ్ల విషయంలో అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏటా జరిగే తంతు మాదిరిగానే వ్యాపారులు ధరలు తక్కువ చేసి కొనుగోలు చే యడం.. ఆ తరువాత స్థానికంగానే వ్యాపారులు సీసీఐ కి ఎక్కువకు అమ్ముకోవడం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నా యి. ఈ విషయంలో అధికారులతో కలిసి సీసీఐ ఒక నిర్ణ యా న్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. అయినా రైతులకు న్యా యం జరగదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విష యంలో సీసీఐ రైతాంగానికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News