సర్పంచ్ అవినీతి లీలలు.. సస్పెండ్ చేయాలని వార్డు సభ్యుడి నిరసన

దిశ, తుర్కపల్లి : అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన 2వవార్డు సభ్యుడు ఆకుల సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ పడాల వనిత అవినీతి, అక్రమాలు చేస్తూ నిధుల దుర్వినియోగం చేశారని అన్నారు. కాగా, ఈ విషయంపై […]

Update: 2021-11-22 07:02 GMT

దిశ, తుర్కపల్లి : అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన 2వవార్డు సభ్యుడు ఆకుల సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ పడాల వనిత అవినీతి, అక్రమాలు చేస్తూ నిధుల దుర్వినియోగం చేశారని అన్నారు.

కాగా, ఈ విషయంపై మార్చి నెలలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని కలెక్టర్ విచారణ నిమిత్తం అధికారులను ఆదేశించారని అన్నారు. అయితే, ఎనిమిది నెలలు గడుస్తున్నా అధికారులు సర్పంచ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. అధికారులు.. అవినీతికి పాల్పడుతున్న సర్పంచ్‌కు అండగా ఉన్నారని ఆరోపించారు. అందుకు నిరసనగా మండల పరిషత్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అవినీతి, అక్రమాలు చేస్తూ నిధుల దుర్వినియోగం చేసిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.

 

Tags:    

Similar News