‘మల్లన్న’ కో అంటే కోటి.. మంత్రి నీడలో కార్పొరేటర్ల వసూళ్ల దందా..?
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ఇల్లు కట్టాలన్నా, ఉన్న ఇంటికి మరమ్మతులు చేపట్టాలన్నా స్థానిక కార్పొరేటర్లకు ముడుపులు చెల్లించాల్సిందే. ఎంతటివారైనా సరే. కాదు.. కుదరదు.. అంటే అధికారులకు చెప్పి కూల్చేయిస్తారు. జవహర్ నగర్ భూముల్లో రేకుల ఇళ్లు కట్టుకున్నా రూ.50 వేలు, ఇల్లు కట్టుకుంటే రూ.లక్ష వసూళ్లు చేస్తున్నారని కార్పొరేటర్లు..? అది మనోడైనా.. వేరేవాడైనా కార్పొరేటర్ చేతిలో డబ్బులు పెట్టాకే నివాస గృహానికి అనధికారికంగా అనుమతులు. లేదంటే అంతే.. డబ్బులు పెట్టి గెలిచినం.. డబ్బులు వసూళ్లు చేసుకోవడానికే […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ఇల్లు కట్టాలన్నా, ఉన్న ఇంటికి మరమ్మతులు చేపట్టాలన్నా స్థానిక కార్పొరేటర్లకు ముడుపులు చెల్లించాల్సిందే. ఎంతటివారైనా సరే. కాదు.. కుదరదు.. అంటే అధికారులకు చెప్పి కూల్చేయిస్తారు. జవహర్ నగర్ భూముల్లో రేకుల ఇళ్లు కట్టుకున్నా రూ.50 వేలు, ఇల్లు కట్టుకుంటే రూ.లక్ష వసూళ్లు చేస్తున్నారని కార్పొరేటర్లు..? అది మనోడైనా.. వేరేవాడైనా కార్పొరేటర్ చేతిలో డబ్బులు పెట్టాకే నివాస గృహానికి అనధికారికంగా అనుమతులు. లేదంటే అంతే.. డబ్బులు పెట్టి గెలిచినం.. డబ్బులు వసూళ్లు చేసుకోవడానికే ప్రజాప్రతినిధులం.. అనే ధోరణి తప్పా.. ఇంకేమి పట్టదు.. మా మల్లన్న నోట కోట్ల మాట.. మాకేం మేం చేసేదే పైసల వసూళ్ళు.. ఎవరేం చేస్తారు.. మా మంత్రి ఉండగా.. అనే ధోరణిలో కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇందుకు సాక్షాత్తు మంత్రి మల్లారెడ్డి ముందే 5 వ డివిజన్ కార్పొరేటర్ ఏకే మురుగేష్ పై సహచర సన్నిహితుడు ఆవేదన వెల్లబోసిన ఘటన కార్పొరేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. కార్పొరేటర్ ఏకే మురుగేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న 5వ డివిజన్‌లోని ప్రధాన కూడలిలో హై మాక్స్ సౌకర్యం కోసం మంత్రి మల్లారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించే కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటేష్ గౌడ్ ఒక్కసారిగా మంత్రి మల్లారెడ్డి ముందే ఏకే మురుగేష్ పై పలు ఆరోపణలు చేశారు.
వెంకటేష్ ఆవేదనలో చేసిన ఆరోపణలు మంత్రికి అక్కడున్న నాయకులను ఒక్కసారిగా పరేషాన్‌కు చేశాయి. కార్పొరేటర్ పై చేసిన ఆరోపణలు వీడియోలో వినొచ్చు.. ఆ తర్వాత పోలీసులు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకోవడం కొసమెరుపు. కాగా, కార్పొరేటర్ మురుగేష్ పై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి. మంత్రికి దగ్గరగా ఉంటూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో మురుగేష్ మంత్రి అండతో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు సొంత పార్టీ నేతలే బహిరంగా ఆరోపణలు చేస్తున్నారు.