మంగళగిరిలో కరోనా.. బితుకుబితుకు మంటున్న బంధువులు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కరోనా ఆందోళనలో పడేసింది. సీఆర్డీఏ రీజియన్ పరిధిలోని మంగళగిరిలో కరోనా బాధితులు ఫీవర్ ఆసుపత్రిలో చేరడంతో వారి బంధువులు భీతావహులవుతున్నారు. వారికి కరోణా లక్షణాలు బయపడగానే మంగళగిరిలో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆఘమేఘాలమీద ఆంక్షలు విధించి, అమలులోకి తెచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే… వారం రోజుల క్రితం అమెరికా నుంచి వృద్ధ దంపతులు అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి రావడంతో వారింట్లో నాలుగు రోజుల పాటు పండగ వాతావరణం నెలకొంది. వారిని […]

Update: 2020-03-19 01:58 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కరోనా ఆందోళనలో పడేసింది. సీఆర్డీఏ రీజియన్ పరిధిలోని మంగళగిరిలో కరోనా బాధితులు ఫీవర్ ఆసుపత్రిలో చేరడంతో వారి బంధువులు భీతావహులవుతున్నారు. వారికి కరోణా లక్షణాలు బయపడగానే మంగళగిరిలో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆఘమేఘాలమీద ఆంక్షలు విధించి, అమలులోకి తెచ్చారు.

ఇంతకీ ఏం జరిగిందంటే… వారం రోజుల క్రితం అమెరికా నుంచి వృద్ధ దంపతులు అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి రావడంతో వారింట్లో నాలుగు రోజుల పాటు పండగ వాతావరణం నెలకొంది. వారిని చూసేందుకు, అమెరికా విశేషాలు తెలుసుకునేందుకు బంధువులు క్యూ కట్టారు. దీంతో సందడి సందడిగా మారింది. ఈ పండగ సందడి సద్దమణగడంతో దంపతుల్లో మహిళకు జలుబు, జ్వరం సోకాయి. దీంతో ఆమె కరోనా ఆందోళనతో ఫీవర్ ఆసుపత్రికి వెళ్లారు. ఆమెలో కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో, రక్త నమూనాలను తిరుపతిలోని స్విమ్స్‌కి పంపించారు. ఆ నమూనాల ఫలితాలు రాకముందే ఆమె భర్త కూడా జలుబు, జ్వరంతో బాధపడుతూ అదే ఆసుపత్రిలో చేరారు.

దీంతో బెంబేలెత్తిన అధికారులు సత్వర చర్యలకు ఉపక్రమించారు. ఈ కరోనా మంగళగిరి మొత్తం విస్తరించకుండా ఆంక్షలు విధించి, అమలులోకి తెచ్చారు. రోడ్ల పక్కన ఉండే అల్పాహార శాలలు, చికెన్, మటన్ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లను మూసివేయాలని సూచించారు. ఈ నెల 31 వరకూ అన్ని బహిరంగ వ్యాపార సముదాయాలనూ మూసి ఉంచాలని ఆదేశించారు. ఉత్తర్వులు అతిక్రమిస్తే, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

మరోవైపు దంపతులు అమెరికా నుంచి రావడంతో వారిని కలిసేందుకు వచ్చిన బంధువుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వీరిద్దరికీ కరోనా అని తేలితే వారిని కలసిన ప్రతి ఒక్కరినీ, వారిని కలిసిన వారందర్నీ పరీక్షించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వారి బంధువుల జాగ్రత్తగా, హౌస్ క్వారంటైన్‌లో ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఇంకో వైపు అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలంటూ సీఆర్డీఏ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వానిని తక్షణం ఆందోళనలు నిలిపేసి, ఇళ్లకే పరిమితమవ్వాలని అధికారులు సూచించారు.

Tags: coronavirus, ap, mangalagiri, old couple, amaravathi protesters

Tags:    

Similar News