భారీగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. మార్చి నెలకు సంబంధించి గీస్టీ వసూళ్ల్పై కరోనా వైరస్ తీవ్రమైన ప్రభావం చూపించింది. మార్చి నెలలో కేవలం రూ. 28,309 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగినట్టు కేంద్రం వెల్లడించింది. గతేడాది మార్చిలో రూ. 1.13 లక్షల కోట్లతో పోలిస్తే ఈ మార్చిలో చాలా తక్కువ వసూళ్లు జరిగాయి. ఈ వసూళ్లు కొంత ఆందోళన కలిగించేలా ఉందని అధికారులు చెబుతున్నారు. దేశంలో లాక్‌డౌన్ మార్చి 24 […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. మార్చి నెలకు సంబంధించి గీస్టీ వసూళ్ల్పై కరోనా వైరస్ తీవ్రమైన ప్రభావం చూపించింది. మార్చి నెలలో కేవలం రూ. 28,309 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగినట్టు కేంద్రం వెల్లడించింది. గతేడాది మార్చిలో రూ. 1.13 లక్షల కోట్లతో పోలిస్తే ఈ మార్చిలో చాలా తక్కువ వసూళ్లు జరిగాయి. ఈ వసూళ్లు కొంత ఆందోళన కలిగించేలా ఉందని అధికారులు చెబుతున్నారు. దేశంలో లాక్‌డౌన్ మార్చి 24 నుంచి విధించినప్పటికీ..అప్పటివరకూ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగినప్పటికీ..పన్ను వసూళ్లు జరగలేదు. మార్చి తొలి వారం నుంచే తయారీ, దిగుమతులను పరిమితం చేయడంతో ఆర్థిక కార్యకలాపాలు తగ్గాయి. రాష్ట్రాల్లో రూ. 50,000 కన్నా ఎక్కువ విలువైన వస్తువుల రవాణా చేసేందుకు ఈ-వే బిల్లులు అవసరమైతే మార్చిలో 30 శాతం తగ్గగా..ఏప్రిల్‌లో 80 శాతానికి క్షీణించింది.
కరోనా వల్ల కలిగిన నష్టాలను తగ్గించేందుకు ఆర్థిక ఉద్దీపన ప్రకటించాలని డిమాండ్లు వినిప్స్తున్న క్రమమలో పన్ను వసూళ్లు తగ్గిపోవడం కేంద్ర ప్రభుత్వాన్ని అధిక ఒత్తిడికి గురి చేస్తోందని, మరోవైపు ప్రత్యక్ష, పరోక్ష పన్నులను పెంచాలనే సూచనలు ఇవ్వాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మార్చి రిటర్నులు మే ఐదవ తేదీ వరకూ చెల్లించే వీలు ఉన్నందున..పన్ను వసూళ్లు పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మే, జూన్ నెలలకు పరోక్ష పన్ను వసూళ్లు మరింత తగ్గొచ్చనే విషయాన్ని అధికారులు అంగీకరించారు. కేంద్ర లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు మునుపటిలా వేగవంతం అవడానికి ఇంకా సమయం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వస్తువులు, సేవలకు సంబంధించి వ్యాప్రాలు పరిమితం కావడం వల్ల పన్నులు కూడా తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Tags: GST, gst collections, gst march collections