మంటగలిసిన మానవత్వం.. పొలాల్లోనే శవం

కరోనా వైరస్‌ మానవత్వాన్ని మంటగలిసేలా చేస్తోంది. ధర్మం ప్రకారం అతి పవిత్రమైన కర్మకాండలను కూడా శాస్త్రోక్తంగా నిర్వహించుకునే వెసులుబాటు లేకుండా చేస్తోంది. కరోనా మహమ్మారికి భయపడ్డ దేశం లాక్‌డౌన్ విధిస్తే… సొంతూరు చేరుకునేందుకు సుదూరతీరాలు నడిచి, అలసిసొలసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని కరోనా సోకిందని రోజంతా పొలాల్లోనే వదిలేసిన దౌర్భాగ్య స్థితి ఏపీలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే… చిత్తూరు జిల్లాకి చెందిన హరిప్రసాద్‌ అనే యువకుడు జీవనోపాధి నిమిత్తం బెంగళూరు వెళ్లారు. కరోనా వ్యాప్తి నిరోధానికి […]

Update: 2020-04-30 05:50 GMT

కరోనా వైరస్‌ మానవత్వాన్ని మంటగలిసేలా చేస్తోంది. ధర్మం ప్రకారం అతి పవిత్రమైన కర్మకాండలను కూడా శాస్త్రోక్తంగా నిర్వహించుకునే వెసులుబాటు లేకుండా చేస్తోంది. కరోనా మహమ్మారికి భయపడ్డ దేశం లాక్‌డౌన్ విధిస్తే… సొంతూరు చేరుకునేందుకు సుదూరతీరాలు నడిచి, అలసిసొలసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని కరోనా సోకిందని రోజంతా పొలాల్లోనే వదిలేసిన దౌర్భాగ్య స్థితి ఏపీలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే…

చిత్తూరు జిల్లాకి చెందిన హరిప్రసాద్‌ అనే యువకుడు జీవనోపాధి నిమిత్తం బెంగళూరు వెళ్లారు. కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్ విధించడంతో బెంగళూరు నుంచి సొంత గ్రామమైన రామసముద్రంకి కాలినడకన వచ్చాడు. సుదీర్ఘ కాలం నడవడంతో తీవ్రంగా అలసి, సొలసి, అనారోగ్యానికి గురై ఊరి చివర పొలాల్లోనే ప్రాణాలు విడిచాడు. యువకుడు బెంగళూరు నుంచి రావడంతో కరోనా సోకడంతోనే ప్రాణాలు కోల్పోయాడని భావించి అయినవారెవరూ మృతదేహం దగ్గరకు వెళ్లలేదు.

ఆఖరుకి ప్రాణభయంతో కుటుంబ సభ్యులు, బంధువులు కూడా అంత్యక్రియలు జరిపేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ పొలాల్లోనే ఒకరోజంతా ఆ మృతదేహం ఉండిపోయింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు, వైద్యులు అక్కడకు చేరుకుని, మృతదేహం నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా, నెగిటివ్ వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చే వరకు మృతదేహం వద్ద రెవెన్యూ సిబ్బందే కాపలాగా ఉండడం విశేషం. నెగిటివ్‌ వచ్చినాక గుండెలు బాదుకుంటూ కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

Tags: chittoor district, man detained for travelling hours, bangalore to ramasamudram, corona fear, no humanity

Tags:    

Similar News