దేవుడి దర్శనం లేకుండా చేస్తోన్న కరోనా

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రభావం అంతటా వ్యాపిస్తోంది. దేశ చరిత్రలోనే దేవాలయాలపై మహమ్మారి చూపిన ప్రభావం ఏ యుద్ధాలు కూడా చూపలేదు. అయితే, ఏపీలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతూ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా ఏకంగా అర్చకులకు సోకడంతో దర్శనాలు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలోని అరసపల్లి సూర్యానారాయణ స్వామి ఆలయంలో కూడా దర్శనాలు రద్దు చేశారు. […]

Update: 2020-07-19 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రభావం అంతటా వ్యాపిస్తోంది. దేశ చరిత్రలోనే దేవాలయాలపై మహమ్మారి చూపిన ప్రభావం ఏ యుద్ధాలు కూడా చూపలేదు. అయితే, ఏపీలో కూడా కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతూ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా ఏకంగా అర్చకులకు సోకడంతో దర్శనాలు రద్దు చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలోని అరసపల్లి సూర్యానారాయణ స్వామి ఆలయంలో కూడా దర్శనాలు రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని.. రేపటి నుంచి ఈ నెల 31 వరకు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అదికారులు ప్రకటించారు. అటు శ్రీశైలం దేవస్థానంలో దర్శనాల రద్దు కొనసాగుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ప్రతి ఆదివారం మూసేస్తునట్లు తెలుస్తోంది. ఏపీలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాలు రద్దు కొనసాగడం ఇదే తొలిసారి

Tags:    

Similar News