కుటుంబాన్ని చిదిమేసిన కరోనా..

దిశ, బోథ్ : కరోనా.. కరోనా.. కరోనా..ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకటే మాట, ఎప్పుడు ఎక్కడి నుండి ఎవరి చావు వినలో, ఎవరు సీరియస్‌గా ఉన్నారో అని వార్త వినాల్సివస్తుందోనని గుబులు పెడుతుంది… బోథ్ మండల కేంద్రంలోని ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు బోథ్ మండలంలో మరణాల జాబితా 40 కి పైకి చేరింది. తాజాగా బోథ్ మండల కేంద్రానికి చెందిన మేర్గు నర్సయ్య కుటుంబంలో అరు రోజుల వ్యవధిలోనే ముగ్గురు […]

Update: 2021-05-05 01:06 GMT

దిశ, బోథ్ : కరోనా.. కరోనా.. కరోనా..ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఒకటే మాట, ఎప్పుడు ఎక్కడి నుండి ఎవరి చావు వినలో, ఎవరు సీరియస్‌గా ఉన్నారో అని వార్త వినాల్సివస్తుందోనని గుబులు పెడుతుంది… బోథ్ మండల కేంద్రంలోని ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు బోథ్ మండలంలో మరణాల జాబితా 40 కి పైకి చేరింది. తాజాగా బోథ్ మండల కేంద్రానికి చెందిన మేర్గు నర్సయ్య కుటుంబంలో అరు రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోవడంతో బోథ్ వాసుల్లో భయం మొదలయింది. మేర్గు నర్సయ్యకి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.

ఇటీవల మెర్గు నర్సయ్య కరోనాతో ఇంట్లో చికిత్స పొందుతూ మే 1న మరణించాడు. తండ్రి ద్వారా భార్య మేర్గు లక్ష్మీకి, చిన్న కొడుకు చిన్న నర్సయ్య(40)కి కరోనా సోకింది. వీళ్లు నిర్మల్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మే3 నాడు చిన్న కొడుకు చిన్న నర్సయ్య మృతి చెందాడు. ఈ విషాదం నుండి కొలుకొక ముందే బుధవారం ఉదయం మేర్గు లక్ష్మీ మృతి చెందింది. అంతేకాకుండా చిన్న నర్సయ్య భార్య కూడా కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఇలా వరుస మరణలుతో ఆ కుటుంబ పరిస్ఠితి అంత్యత బాధవర్ణ రహితంగా మారింది. వీరి కుటుంబ మరణాలు స్థానికులను కూడా కలిచివేశాయి.

Tags:    

Similar News