DTC పాపారావుకు అంతర్జాతీయ గౌరవం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో డీటీసీ(డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్)గా విధులు నిర్వర్తిస్తోన్న డాక్టర్ పాపారావుకు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక కరోనా వారియర్స్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం విశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి సమయంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో పాపారావు చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రకటించినట్లు సంస్థ సీఈవో సత్యవోలు రాంబాబు తెలిపారు. అంతేగాకుండా రాష్ట్రంలోని […]
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కేంద్ర కార్యాలయంలో డీటీసీ(డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్)గా విధులు నిర్వర్తిస్తోన్న డాక్టర్ పాపారావుకు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక కరోనా వారియర్స్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం విశ్వగురు వరల్డ్ రికార్డు సంస్థ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి సమయంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో పాపారావు చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రకటించినట్లు సంస్థ సీఈవో సత్యవోలు రాంబాబు తెలిపారు. అంతేగాకుండా రాష్ట్రంలోని 50 వేల మంది ఆటో, టాక్సీ డ్రైవర్లకు వాక్సినేషన్ ఇప్పించడంలో ఆయన చొరవ తీసుకున్నట్లు గుర్తుచేశారు. ఈ అవార్డును పాపారావుకు ప్రముఖుల సమక్షంలో అందజేస్తామని సంస్థ సీఈవో వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, రవాణా శాఖ అధికారులు పాపారావుని ప్రశంసించారు.