కరోనా విజయుడైన రాజమండ్రి యువకుడు
కరోనా మహమ్మారి బారినపడి గెలవడమంటే సాధారణ విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాజమండ్రికి చెందిన ఒక యువకుడు కరోనా విజయుడై ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. లండన్ నుంచి రాజమండ్రికి వచ్చిన సదరు యువకుడు హౌస్ క్వారంటైన్‌లో ఉన్నాడు. కరోనా లక్షణాలు కనిపించడంలో కాకినాడలోని జీజీహెచ్‌కు తరలించారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించగా మార్చి 22న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు. రెండు వారాల చికిత్స తరువాత అతని […]
కరోనా మహమ్మారి బారినపడి గెలవడమంటే సాధారణ విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రాజమండ్రికి చెందిన ఒక యువకుడు కరోనా విజయుడై ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాడు. లండన్ నుంచి రాజమండ్రికి వచ్చిన సదరు యువకుడు హౌస్ క్వారంటైన్‌లో ఉన్నాడు. కరోనా లక్షణాలు కనిపించడంలో కాకినాడలోని జీజీహెచ్‌కు తరలించారు. అతనికి వైద్యపరీక్షలు నిర్వహించగా మార్చి 22న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు. రెండు వారాల చికిత్స తరువాత అతని పరిస్థితి మెరుగైంది. రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. దీంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలో వైద్యులు ఆసుపత్రి నుంచి సదరు యువకుడిని డిశ్చార్చి చేశారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 28 మందికి నిర్వహించిన కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.
Tags: corona virus, man recovered corona, rajamundry, ggh kakinada, east godavari