ఒకే కుటుంబంలో ఐదుగురిని బలితీసుకున్న కరోనా.. అనాథగా మారిన బాలుడు

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ఆ కుటుంబాన్ని పగబట్టింది. ఒకేసారి ఐదుగురిని బలి తీసుకుంది. దీంతో 12 ఏళ్ల బాలుడు అనాథగా మారాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. రాజనగరం సమీపంలోని గైట్ కాలేజీ ఎదురుగా బ్రిడ్జికౌంట్‌లో నివాసం ఉంటున్న మెడిచర్ల సుధీర్ రాయల్ కుటుంబం నివశిస్తోంది. రాయల్ భార్య శ్వేత హరిత, కొడుకు సాయి సత్య సహర్ష. సాయి సత్య సహర్ష రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి […]

Update: 2021-06-19 10:05 GMT

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ ఆ కుటుంబాన్ని పగబట్టింది. ఒకేసారి ఐదుగురిని బలి తీసుకుంది. దీంతో 12 ఏళ్ల బాలుడు అనాథగా మారాడు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. రాజనగరం సమీపంలోని గైట్ కాలేజీ ఎదురుగా బ్రిడ్జికౌంట్‌లో నివాసం ఉంటున్న మెడిచర్ల సుధీర్ రాయల్ కుటుంబం నివశిస్తోంది. రాయల్ భార్య శ్వేత హరిత, కొడుకు సాయి సత్య సహర్ష. సాయి సత్య సహర్ష రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. కరనా సెకండ్ వేవ్‌లో అతడి కుటుంబ సభ్యులను కోల్పోయాడు. తల్లిదండ్రులతోపాటు మరో ముగ్గురిని మహమ్మారి బలితీసుకోవడంతో సహర్ష అనాథగా మారాడు. సుభద్ర హాస్పిటల్లో కరోనాకు వైద్యం చేయించుకున్నా ఫలితం దక్కకపోగా, ఆ ఆసుపత్రి యాజమాన్యం దాదాపు రూ.28 లక్షలు వైద్య ఖర్చయినట్టు తెలపడంతో అప్పులు చేసి మరీ చెల్లించినట్లు సహర్ష తెలిపాడు.

ఈ విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్ ఆ బాలుడి ఇంటికి వెళ్లారు. బాలుడిని పరామర్శించారు. బాలుడి మేనమామను సైతం పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఒకే ఇంట్లో అయిదుగురు కరోనాకు బలవ్వడం దురదృష్టకరమన్నారు. కరోనా నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఆసుపత్రి యాజమాన్యం డబ్బుల కోసం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమన్నారు. అప్పుచేసి ఆసుపత్రికి సొమ్ములు కట్టినట్టు తెలిసిందన్నారు. ఆ సొమ్ములు తిరిగి ఇప్పించటంతో పాటు ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఇప్పటికే సీఎం జగన్ కరోనా సమయంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు రూ.10 లక్షలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే బాలుడు విద్యకు సంబంధించి అవసరమైతే కేంద్ర విద్యాలయంలో చేర్పిస్తానని.. సహర్ష అంగీకరిస్తే ఈ విద్యా సంవత్సరం నుంచే చేరేలా ఏర్పాట్లు చేస్తానని ఎంపీ మార్గాని భఱత్ రామ్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News