బతుకులు ఆగమయ్యాయి ఇలా..
దిశ, వెబ్‌డెస్క్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ మహమ్మారి మన జీవన విధానాన్నే మార్చేసింది. • మొదటి కరోనా పాజిటివ్ కేసులు జనవరి 30న కేరళలో నమోదైంది. • మొదటి కరోనా మరణం కర్నాటకలోని కల్బుర్గిలో 76 ఏళ్ళ వృద్ధుడు. • మొదటి కరోనా కేసు తెలంగాణలో మార్చి 2న నమోదైంది. • దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కోటి దాటాయి. అమెరికా తర్వాత అత్యధిక కేసులున్న దేశం […]
దిశ, వెబ్‌డెస్క్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ మహమ్మారి మన జీవన విధానాన్నే మార్చేసింది.
• మొదటి కరోనా పాజిటివ్ కేసులు జనవరి 30న కేరళలో నమోదైంది.
• మొదటి కరోనా మరణం కర్నాటకలోని కల్బుర్గిలో 76 ఏళ్ళ వృద్ధుడు.
• మొదటి కరోనా కేసు తెలంగాణలో మార్చి 2న నమోదైంది.
• దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కోటి దాటాయి. అమెరికా తర్వాత అత్యధిక కేసులున్న దేశం ఇండియా.
• భారత్‌లో కరోనా మృతుల సంఖ్య దాదాపు లక్షన్నర.
• అత్యధికంగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు, కరోనా మృతుల సంఖ్య నమోదైంది.
• దేశంలో మార్చి 24న తొలి లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. మూడు దశల తర్వాత అన్‌లాక్ మొదలైంది.
• తొలి లాక్‌డౌన్ నిర్ణయాన్ని హఠాత్తుగా ప్రకటించడంతో కోట్లాది మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వాహనాలు నిలిచిపోయాయి.
• రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. స్వగ్రామాలకు వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. వేలాది కిమీ కాలినడకనే వెళ్లారు.
• దారి పొడుడునా తిండిలేక, తాగడానికి నీళ్లు లేక పడరాని పాట్లు పడ్డారు. కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోయాయి.
• విమానాలలో తిరిగేవారు మోసుకొచ్చిన కరోనా వైరస్ బుక్కెడు బువ్వకోసం పరితపించే ప్రజలకు కష్టాలను తెచ్చిపెట్టింది.
• దేశమంతా ఏకకాలంలో కర్ఫ్యూ అమలైంది. కొన్ని నెలల పాటు భారత్ బంద్ తరహా పరిస్థితి నెలకొంది.
• బుక్కెడు బువ్వ పెట్టేవారు ఎప్పుడొస్తారా అని వేయి కళ్ళతో ఎదురుచూశారు.
• దుకాణాలన్నీ బంద్ కావడంతో పాలు, ఉప్పు, పప్పు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి.
• ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం పోయింది.
• జనతా రైళ్లు, ఉచిత ప్రయాణంలాంటి ప్రభుత్వ హామీలన్నీ పసలేనివని తేలిపోయింది.
• పల్లెలు, పట్నాలలో జనజీవితం అస్తవ్యస్తమైపోయింది.
• మాస్కు గురించే తెలియనివారంతా నిత్యం మాస్కులతోనే కనిపించారు. వైద్య సిబ్బందికి మాత్రమే పరిమితమైన శానిటైజర్ అనే విధానం సామాన్యులకు కూడా అర్థమైంది.
• మనిషిని సోషల్ యానిమల్ అంటారు. సమాజంలో కలిసి ఉండాలే తప్ప విడిగా ఉండొద్దనేవారు. కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్ విధానం వచ్చింది.
• ఒకే ఇంట్లో ఉండేవారూ ఆరడగుల దూరం పాటించాల్సి వచ్చింది.
• షేక్ హాండ్‌లు బందయ్యాయి. అలాయ్ బలాయ్ బందైంది. ఆప్యాయంగా మాట్లాడుకునే అవకాశాలూ లేకుండా పోయాయి.
• కరోనా టెస్టుల కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్నారు.
• మద్యం దుకాణాలు మూతబడడంతో వైట్‌నర్, స్పిరిట్ లాంటివి తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. నరాల వ్యవస్థ దెబ్బతిని ఎర్రగడ్డలోని మెంటల్ ఆసుపత్రికి క్యూ కట్టారు.
• కరోనా వైరస్ ఒక మహమ్మారి అని ప్రైవేటు ఆసుపత్రులు మరింతగా భయపెట్టి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసి ప్రజల రక్తాన్ని పీల్చాయి.
• ఆసుపత్రుల ఫీజు కట్టడంకంటే చనిపోవడమే మేలనే అభిప్రాయం నెలకొంది.
• కడసారి చూపు కోసం హితులు, సన్నిహితులు వచ్చే సంప్రదాయానికి కరోనా బ్రేక్ వేసింది. కన్నతండ్రి చనిపోయినా తలకొరివి పెట్టలేని బాధలు ఎన్నో.
• పీపీఈ కిట్ ధరించిన వైద్య సిబ్బంది ఒకసారి అంతరిక్షంలో తిరిగే మనుషులుగా, మరికొన్ని సందర్భాలలో యమదూతలుగా కనిపించేవారు.
• ప్రభుత్వాసుపత్రులలో ఎన్నడూ చూడని నరకాన్ని ఇన్ పేషెంట్లు అనుభవించారు.
• వర్క్ ఫ్రం హోమ్ నిర్ణయంతో ఇంట్లోని మహిళలకు ఎన్నడూ లేనంత పని పెరిగింది.
• లాక్‌డౌన్ కారణంగా రిక్షా, ఆటో, ట్రావెల్స్, కాబ్ డ్రైవర్లు, కార్ఖానా కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆర్థిక సమస్యలలో చికున్నారు. ఆత్మహత్యలు పెరిగాయి.
• పట్నం విడిచి పల్లెబాట పట్టారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు సైతం పొలం పనుల్లో మునిగిపోయారు.
• స్మార్ట్ ఫోన్లు, టాబ్‌లు, లాప్‌టాప్‌లు, కంప్యూటర్ల అమ్మకాలు పెరిగాయి. ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్లు పెట్టుకోవాల్సి వచ్చింది.
• సినిమాహాళ్ళు బంద్ కావడంతో టీవీల్లోనే ఓటీటీలు రాజ్యమేలాయి.
• ధనికులు మరింత ధనికులుగా మారిపోయారు. పేదలు కడు పేదరికంలో కూరుకుపోయారు. వేతనజీవులు అప్పులపాలయ్యారు.