సాగర్‌ ఎన్నికల ప్రచారంలో కరోనా కలకలం..

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో కరోనా పాజిటివ్ కలకలం రేపింది. వారం, పదిరోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోన్న పలువురు నేతలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రచారానికి వెంట వెళ్లిన మిగిలిన నేతలకు, కార్యకర్తలకు కరోనా భయం పట్టుకుంది. వాస్తవానికి కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సాగర్ ఉపఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న తీరుపై మొదట్నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎవరెంత చెప్పినా.. ఏ పార్టీ […]

Update: 2021-04-07 10:14 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో కరోనా పాజిటివ్ కలకలం రేపింది. వారం, పదిరోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోన్న పలువురు నేతలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రచారానికి వెంట వెళ్లిన మిగిలిన నేతలకు, కార్యకర్తలకు కరోనా భయం పట్టుకుంది. వాస్తవానికి కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సాగర్ ఉపఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్న తీరుపై మొదట్నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎవరెంత చెప్పినా.. ఏ పార్టీ పట్టించుకోలేదు. నిత్యం గుంపులుగా కార్యకర్తల సమీకరణ.. మాస్కులు ధరించకపోవడం.. నేతలు ఏ కోశాన హెచ్చరించకపోవడం వంటి అంశాలన్నీ ఇప్పుడు ప్రమాదకరస్థాయికి తీసుకొచ్చాయనే చెప్పాలి.

14 మంది నేతలకు పాజిటివ్..

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న 14 మంది కీలక నేతలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్టు సమాచారం. ఇందులో ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు సైతం ఉన్నారట. అయితే వీరి నుంచి ఎంత మంది కార్యకర్తలకు సోకిందోనని అంతటా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు వీరివెంట ప్రచారంలో తిరిగిన నేతలు, కార్యకర్తల్లో కరోనా భయం పట్టుకుంది. ఇదిలావుంటే.. నేతలకు కరోనా సోకిన విషయాన్ని బయటకు పొక్కనీయకుండా దాస్తుండడం గమనార్హం. ఇందుకు కారణం లేకపోలేదు. ఒకవేళ కరోనా సోకిన విషయం బయట పడితే.. ప్రచారానికి కార్యకర్తలు వచ్చే అవకాశం లేదని, ఫలితంగా బలనిరూపణ విషయంలో వెనకపడిపోతామనే ఆలోచనతో నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News