భారతదేశ కొవిడ్ వ్యాక్సిన్‌లు.. కొన్ని వివరాలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలు, బయోటెక్నాలజీ సంస్థలు ఇప్పుడు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నాయి. అలాగే భారత్‌లోని ప్రముఖ బయోటెక్ సంస్థలు కూడా తమకు వీలైనంతగా కృషి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మన దేశంలో ఎన్ని కొవిడ్ వ్యాక్సిన్‌లు ప్రతిపాదనలో ఉన్నాయి? అవి ఏయే దశల్లో ఉన్నాయనే సంగతి గురించి అందరిలోనూ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి మీకోసం కొన్ని వివరాలు.. భారతదేశంలో ఎన్ని? ఇప్పటివరకు […]

Update: 2020-08-26 01:55 GMT

దిశ, వెబ్‌డెస్క్:

ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలు, బయోటెక్నాలజీ సంస్థలు ఇప్పుడు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నాయి. అలాగే భారత్‌లోని ప్రముఖ బయోటెక్ సంస్థలు కూడా తమకు వీలైనంతగా కృషి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మన దేశంలో ఎన్ని కొవిడ్ వ్యాక్సిన్‌లు ప్రతిపాదనలో ఉన్నాయి? అవి ఏయే దశల్లో ఉన్నాయనే సంగతి గురించి అందరిలోనూ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి మీకోసం కొన్ని వివరాలు..

భారతదేశంలో ఎన్ని?

ఇప్పటివరకు వ్యాక్సిన్‌లు రెడీ అయ్యి, హ్యుమన్ ట్రయల్స్ జరుగుతున్నవి మన దేశంలో మూడు వ్యాక్సిన్‌లు ఉన్నాయి. అవి: 1. భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి వారు సంయుక్తంగా తయారుచేస్తున్న కొవాక్సిన్, 2. జైడస్ కడీలా నుంచి జైకొవ్-డి, 3. ఆక్స్‌ఫర్డ్ వాక్సిన్ ప్రాజెక్ట్ ఆధారితంగా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిద్ధం చేస్తున్న కొవిషీల్డ్.

ఏయే దశల్లో ఉన్నాయి?

కొవాక్సిన్ మందు క్లినికల్ ట్రయల్ స్టేజీలోని ఫేజ్ 1, 2 దశలో ఉండగా, జైకొవ్-డి మాత్రం ఫేజ్ 1 హ్యుమన్ ట్రయల్‌లో ఉంది. ఇక కొవిషీల్డ్ ఇటీవల ఫేజ్ 1, 2 ట్రయల్స్ కోసం భారతదేశంలో ఆమోదం పొందింది.

వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది?

ఇప్పుడు హ్యుమన్ ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్‌ల ప్రయోగాలు విజయవంతమైతే, ఈ వ్యాక్సిన్‌లు 2021 మొదటి త్రైమాసికం వరకు ప్రజలకు అందుబాటులోకి రావొచ్చు.

మొదటి వ్యాక్సిన్ ఎవరికి?

వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో తయారైన వెంటనే మొదటి వ్యాక్సిన్‌ను కరోనా కట్టడిలో ముందుండి పనిచేసిన వైద్య సిబ్బంది, నర్సులు, పోలీసులతో పాటు ఆర్మీ సైనికులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వ్యాక్సిన్ ధర ఎంత ఉండవచ్చు?

వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్న పై మూడు సంస్థలతో భారత ప్రభుత్వం వ్యాక్సిన్ ధర గురించి చర్చలు చేసింది. అయితే ఇప్పటివరకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు చేస్తున్న కొవిషీల్డ్ ధర మాత్రమే అధికారికంగా తెలిసింది. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ వారి సహకారంతో వారు ఈ వ్యాక్సిన్‌ను రూ. 240కి ఇవ్వనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News