ఆరునెలల్లో కరోనాకు వ్యాక్సిన్?
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తుండటంతో ఇప్పటికే అనేక దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టే యోచనలో పడ్డాయి. రష్యా దేశంలో క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ కలిపి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మరో ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ‘ది టైమ్స్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివరికల్లా అన్ని అనుమతులు వస్తాయని, వెంటనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తుండటంతో ఇప్పటికే అనేక దేశాలు వ్యాక్సిన్ కనిపెట్టే యోచనలో పడ్డాయి. రష్యా దేశంలో క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ కలిపి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మరో ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ‘ది టైమ్స్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివరికల్లా అన్ని అనుమతులు వస్తాయని, వెంటనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆ కథనంలో పేర్కొంది. అంతేగాకుండా వ్యాక్సిన్ వచ్చాక ముందుగా పెద్దలందరికీ ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని సమాచారం.