తొలిదశలో 23శాతం మందికి కరోనా వ్యాక్సిన్ !

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ వ్యాక్సిన్‌లు తీసుకొస్తున్నాయి. ఇదేక్రమంలో రష్యా ఓ అడుగు ముందుండి ఇప్పటికే వ్యాక్సిన్‌ను ఆదేశ ప్రజలకు అందిస్తోంది. ఇక భారత్‌లో సైతం కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్‌ చివరి దశలో ఉండటంతో ముందుగా ఎవరికి వ్యాక్సిన్ అందించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రెడీ చేసింది. ముందుగా తొలిదశలో 23శాతం జనాభాకు కరోనా టీకాను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. […]

Update: 2020-10-17 06:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ వ్యాక్సిన్‌లు తీసుకొస్తున్నాయి. ఇదేక్రమంలో రష్యా ఓ అడుగు ముందుండి ఇప్పటికే వ్యాక్సిన్‌ను ఆదేశ ప్రజలకు అందిస్తోంది. ఇక భారత్‌లో సైతం కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్‌ చివరి దశలో ఉండటంతో ముందుగా ఎవరికి వ్యాక్సిన్ అందించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రెడీ చేసింది. ముందుగా తొలిదశలో 23శాతం జనాభాకు కరోనా టీకాను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మొదటగా ఆరోగ్యకార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులకు టీకా ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిపింది. అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ముందుగా ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.

Tags:    

Similar News