ఏపీకి భారీగా కరోనా వ్యాక్సిన్ డోస్‌లు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి భారీ సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ డోస్‌లు చేరుకున్నాయి. 9 లక్షల కొవిషీల్డ్, 76,140 కొవాగ్జిన్ డోసులు వచ్చాయి. విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి ఇవి చేరుకున్నాయి. వీటిని వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలకు తరలించనున్నారు. ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని, వ్యాక్సిన్ పంపిణీ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ఇటీవల మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రమే రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందిస్తుందని చెప్పారు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి భారీ సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ డోస్‌లు చేరుకున్నాయి. 9 లక్షల కొవిషీల్డ్, 76,140 కొవాగ్జిన్ డోసులు వచ్చాయి. విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి ఇవి చేరుకున్నాయి. వీటిని వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలకు తరలించనున్నారు.
ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందని, వ్యాక్సిన్ పంపిణీ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ఇటీవల మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రమే రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందిస్తుందని చెప్పారు. దీంతో రాష్ట్రాలకు కాస్త ఊరట కలిగినట్లు అయింది. ఈ నెల 21 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు మోదీ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు తరలిస్తున్నారు. కాగా, వ్యాక్సిన్ డోసులు లేక ఏపీలో వ్యాక్సినేషన్ గత రెండురోజులుగా నిలిచిపోయింది. ఇప్పుడు వ్యాక్సిన్ చేరుకోవడంతో రేపటి నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం కానుంది.