కరోనా.. కలిపింది అందరినీ

దిశ వెబ్ డెస్క్: ‘‘జనాభా లెక్కల్లో ఉండాలనుకుంటే ఇంట్లో ఉండాలి. .. కరోనా లెక్కల్లో ఉండాలంటే.. రోడ్లపై తిరగాలి’’.. ‘‘ఇంట్లో ఉండాలా? జైల్లో ఉండాలా? లేదా ఫోటోలో ఉండాలా? .. నీ ఇష్టం’’. ఇలా కరోనా పై చాలా మంది ఎన్నో రకాల కామెంట్స్, కోట్స్ చెబుతున్నారు. అందులో నిజం లేకపోలేదు. కరోనా రోజురోజుకు పెరిగిపొతొంది. ఈ సమయంలో మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ప్రభుత్వం సూచనల మేరకు ఇంటికి పరిమితం […]

Update: 2020-03-25 04:35 GMT

దిశ వెబ్ డెస్క్: ‘‘జనాభా లెక్కల్లో ఉండాలనుకుంటే ఇంట్లో ఉండాలి. .. కరోనా లెక్కల్లో ఉండాలంటే.. రోడ్లపై తిరగాలి’’.. ‘‘ఇంట్లో ఉండాలా? జైల్లో ఉండాలా? లేదా ఫోటోలో ఉండాలా? .. నీ ఇష్టం’’. ఇలా కరోనా పై చాలా మంది ఎన్నో రకాల కామెంట్స్, కోట్స్ చెబుతున్నారు. అందులో నిజం లేకపోలేదు. కరోనా రోజురోజుకు పెరిగిపొతొంది. ఈ సమయంలో మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ప్రభుత్వం సూచనల మేరకు ఇంటికి పరిమితం అయితే.. కరోనా మహామ్మారిని కట్టడి చేయవచ్చు. అయితే ఈ సమయాన్ని శాపంగా భావించాల్సిన పనిలేదు. భయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన అవసరం లేదు. ఇది మనందరికీ దొరికిన అత్యంత విలువైన సమయం. ఉద్యోగ ఒత్తిళ్ల నుంచి, పని భారం నుంచి, మరెన్నో సమస్యల నుంచి మనకు దొరికిన అద్భుతమైన సదావకాశం ఇది. కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన తరుణమిది. తమ తమ అనుభవాలను, చిన్ననాటి గురుతులను తమ వారితో పంచుకునే విలువైన కాలం ఇది. ఇంట్లోనే మనకు నచ్చిన పని చేసుకోవడానికి లభించిన అరుదైన అవకాశం ఇది. కరోనా కాలాన్ని ఎలా గడపాలి… లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎలా సద్వినియోగం చేసుకోవాలి?..

ఉదయం వేళ…

అమ్మా… స్కూలు టైమ్ అవుతోంది.. త్వరగా నన్ను రెడీ చెయ్.. అంటూ బెడ్ పై నుండే అరుస్తుంది అంకిత. మేడమ్ గారూ.. నిన్న కూడా ఆఫీసు కు లేట్ గా వెళ్లాను. కొంచెం ఫాస్ట్ గా.. టిఫిన్ బాక్స్ రెడీ చెయ్.. సమయం లేదు శ్రీమతి గారు అంటూ.. సాఫ్ట్ వేర్ సుధీర్ కేకలు. కాసేపట్లోనే..వాళ్లందరిని అలర్ట్ చేస్తూ.. గడియారంలో… తొమ్మిదో గంట కొట్టింది. అందరూ చకచకా రెడీ అయ్యారు. గేట్ వద్దకు వచ్చి బైబై లు చెప్పుకున్నారు.

రాత్రి సమయం..

సాయంత్రం 6 గంటలకు అంకిత స్కూలు నుంచి ఇంటికి చేరుకుంది. ఫ్రెష్ అప్ అయ్యింది. స్నాక్స్ తిని హోం వర్క్ చేసుకుంది. అప్పటికే టైమ్ 8 దాటింది. కాసేపు టీవీ చూసింది. నాన్న కోసం ఎదురు చూసి..చూసి అలా హాల్ లోని బెడ్ లో పడుకుంది. 9.30 నిముషాలకు సుధీర్ వచ్చాడు. అప్పటికే అలసిపోయాడు. అతను స్నానం చేశాక, దంపతులు ఇద్దరూ కలిసి అన్నం తిన్నారు. తన భార్య మాధూరి ఏమో చెప్పబోతుండగానే.. ఆపీసు నుంచి కాల్.. అది మాట్లాడే సరికి అర గంట అయ్యింది. ఆ తర్వాత ఆఫీసు మెయిల్స్ చెక్ చేసుకున్నాడు. ఆలోపు సమయం 12 దాటింది. ఇద్దరూ పడుకున్నారు.
మళ్లీ ఉదయం సేమ్ .. అదే హాడావిడి…

ఇది సుధీర్ ఒక్క ఇంట్లోనే కాదు.. దాదాపు అందరి ఇల్లలోనూ ఇదే పరిస్థితి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం కానీ, మనసు విప్పి మాట్లాడుకునే తరునం కానీ ఎవరికీ దొరకడం లేదు. ఇంకొందరి ఇల్లలో అయితే.. ఇద్దరూ ఆఫీసులకు వెళ్తారు. పిల్లల్ని డే కేర్ సెంటర్ లో ఉంచుతారు. వాళ్లిద్దరిలో ఆఫీసు నుంచి ఎవరు తొందరగా వస్తే.. వాళ్లు.. పిల్లల్ని ఇంటికి తీసుకువస్తారు. ఆ తర్వాత ఇద్దరూ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం లేదా ఏదో ఒకటి వండుకొని తినడమో చేస్తారు. ఇంకొందరికీ షిఫ్ట్లు ఉంటాయి. ఒకరు డే షిఫ్ట్ లో పనిచేస్తే.. ఇంకొకరు నైట్ షిప్ట్ లో పనిచేస్తారు. ఇక వీకెండ్స్ లు సరే సరి. ఇలా చూస్తుండగానే అలా అయిపోతాయి. వారంలోని పనులన్నీ ఆ రెండు రోజుల్లోనే చేసుకుంటారు. చాలా మంది ఉద్యోగులకు మాట్లాడుకోవడానికి సమయమే చిక్కడం లేదు.

పల్లె ల్లోనూ అదే పరిస్థితి:

ఇక గ్రామాల్లోనూ ఉద్యోగం చేసే వాళ్ల సంఖ్య, పని చేసే వారి సంఖ్య పెరిగింది. ఇంటి పట్టున ఎవరు ఉండటం లేదు. ఒక వేళ సమయం దొరికిన.. టీవీ చూడటమో లేదా ఫోన్ లో వీడియోలు చూడటమో చేస్తున్నారు. పల్లెల్లో ఫోన్ వినియోగం పెరిగింది. నలుగురు ఇంట్లొ ఉన్నారన్న మాటే కానీ .. కలిసి మాట్లాడుకోవడం తక్కువ అయిపోయింది. వ్యవసాయ పనులు చేసేవాళ్లు, ఇతర పనులకు వెల్లే వాళ్లు అలసిపోయి ఇల్లకు చేరతారు. వాళ్లంతా సూర్యోదయానికి ముందే లేస్తారు. వాళ్లకు కూడా కుటుంబంతో గడిపే సమయం దొరకడం లేదు.

కరోనా కాలం.. కుటుంబంతో విలువైన కాలం:

ఒక రకంగా ఆలోచిస్తే.. కరోనా మనందరినీ కలిపింది. మన కుటుంబ సభ్యులతో హాయిగా గడిపే అవకాశాన్ని ఇచ్చింది. మనసుకు నచ్చిన పనులు చేసుకోవడానికి సమయమిచ్చింది. నచ్చింది చేసుకుని తినడానికి వీలు కల్పించింది. మనలోకి మనం చూసుకోవడానికి దొరికిన అరుదైన తరుణమిది. ఈ సమయాన్ని వీలైనంత సంతోషంగా గడిపి.. కరోనా కాలంగా కాకుండా… కలకాలం గుర్తుండిపోయే కాలంగా మలుచుకోవాలి. టీవీ చూస్తునో, సెల్ ఫోన్ లో గడుపుతూ కాలాన్ని వృథా చేయొద్దు. పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. తల్లిదండ్రులతో గడపాలి. పిల్లల ఆలోచనలేమిటో తెలుసుకోవాలి. ఇంటి సభ్యుల చిన్న నాటి అల్లర్లును పిల్లలకు , తల్లిదండ్రులకు చెప్పండి. అందరూ కలిసి పనుల్లో భాగస్వామ్యం పంచుకోవాలి. పిల్లలకు మంచి మంచి నీతి కథలు చెప్పాలి. మన సంస్కృతి సంప్రదాయాల విలువ చెప్పాలి. పండుగల ప్రాశాస్త్యాన్ని వారికి వివరించాలి. ఇంటి సభ్యులంతా కూర్చుని ఒకరి సమస్యలు గురించి మరొకరు అడిగి తెలుసుకోవాలి. వాటికి పరిష్కార మార్గాలు సూచించాలి. ఇంట్లో ఉండే పెద్ద వాళ్లతో మనసు విప్పి మాట్లాడితే చాలు.. వారికి ఉన్న రోగాలన్నీ మటుమాయం అవుతాయి. వారి యోగక్షేమాలు విచారించాలి. వారికి ఏమైనా అవసరాలు ఉంటే తీరుస్తామనే భరోసా ఇవ్వాలి.

ప్రకృతి ప్రాధాన్యత:

పర్యావరణానికి విఘాతం కలిగిస్తే.. ఎలాంటి విపత్తులు వస్తాయో పిల్లలకు వివరించాలి. మొక్కలు నాటితే కలిగే ప్రయోజనాలకు వారికి చెప్పాలి. నీటిని పొదుపు గా వాడుకోవాలని వారికి సూచించాలి. చిన్నప్పటి నుంచి ఎవరి పనులు వారు చేసుకోవాలని చెప్పాలి. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలి. పుస్తక పఠనాన్ని కాలక్షేపంగా మార్చుకోవాలి.

ఇండోర్ గేమ్స్:

సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా మంది ఆటలు ఆడటం లేదు. సెల్ ఫోన్ లోనే అన్ని ఆటలు ఆడేస్తున్నారు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండకపోగా.. కళ్లు పాడవుతాయి. స్కిన్ డిసేజెస్ వస్తాయి. సెల్ ఫోన్ కు ఆడిక్ట్ అవుతారు. అందువల్ల ఈ విలువైన సమయాన్ని ఇండోర్ ఆటలకు కేటాయించుకోవాలి. చెస్, క్యారమ్స్, అష్టాచెమ్మా, పచ్చీస్, కైలాసం, అంత్యాక్షరి, బ్యాడ్మింటన్, వంటి గేమ్స్ తో కాలక్షేపం చేయొచ్చు. పిల్లలతో దొంగ పోలీస్ , దాగుడు మూతలు ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఇంకా ఎన్నో ఆటలు ఇంట్లోనే ఆడుకునేవి ఉన్నాయి. అందరూ కలసి సంతోషంగా ఆడుకోవచ్చు.

ఇది మనందరి విధి:

కరోనా కాలం లేదా.. లాక్ డౌన్ సమయాన్ని శిక్షగా భావించద్దు. మనం ఆరోగ్యం కోసం అందరం విధిగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సూచనలను పాటిద్దాం. మన శ్రేయస్సు కోసం, కుటుంబ,సమాజ, దేశ ప్రయోజనం కోసం ఇంటి పట్టునే ఉందాం. ఇలాంటి కష్టకాలంలో మనం చూపే నిర్లక్ష్యం,భాద్యత రాహిత్యం మనకేం కాదనుకునే అతి విశ్వాసం, మనం ప్రాణంతో పాటు, మన కుటుంబ సభ్యులతో పాటు చ మొత్తం సమాజాన్ని దేశాన్నే ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. కరోనా వైరస్ కంటికి కనిపించనంతా చిన్న జీవే కావచ్చు.. కానీ అది ప్రపంచానికి అతి పెద్ద సవాల్ విసురుతుంది. మనల్ని మనం కాపాడుకుందాం. తద్వారా మన దేశాన్ని కరోనా నుంచి కాపాడుకుందాం.

Tags: coronavirus, covid-19, family, time, spend, happiness, environment, book read, lock down

Tags:    

Similar News