‘‘గోవు మూత్రం, ఆవు పేడతో కరోనా చికిత్స’’
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాధితో బాధపడేవారికి గోవు మూత్రం, ఆవు పేడతో చికిత్స అందించ్చవచ్చని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సమయంలో బంగ్లాదేశ్‌కు అక్రమంగా గోవులను తరలిస్తున్నారన్న అంశంపై చర్చ జరిగింది. ఆ చర్చలో పాల్గన్న ఎమ్మెల్యే హరిప్రియ. గోవుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ సోకిన వారికి కూడా గోమూత్రం పనిచేస్తుందన్నారు. ఆవు పేడ ఎంత విశిష్టమైందో అందరికీ తెలిసిందేనని, గోవు మూత్రాన్ని కూడా చల్లితే, […]
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాధితో బాధపడేవారికి గోవు మూత్రం, ఆవు పేడతో చికిత్స అందించ్చవచ్చని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సమయంలో బంగ్లాదేశ్‌కు అక్రమంగా గోవులను తరలిస్తున్నారన్న అంశంపై చర్చ జరిగింది. ఆ చర్చలో పాల్గన్న ఎమ్మెల్యే హరిప్రియ. గోవుల గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ సోకిన వారికి కూడా గోమూత్రం పనిచేస్తుందన్నారు. ఆవు పేడ ఎంత విశిష్టమైందో అందరికీ తెలిసిందేనని, గోవు మూత్రాన్ని కూడా చల్లితే, ఆ ప్రాంతాన్ని అది శుద్ధి చేస్తుందని, గోమూత్రం, ఆవుపేడలతో.. కరోనా వైరస్‌ను కూడా అదుపు చేయవచ్చు అన్న అభిప్రాయాన్ని ఆమె వినిపించారు. క్యాన్సర్‌తో పాటు ఇతర అనేక వ్యాధులకు గోవుల ద్వారా చికిత్స అందిస్తారని, గుజరాత్‌లోని ఓ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో.. క్యాన్సర్ పేషెంట్లను గోవులతో గడిపేలా చేస్తారని, వారికి పేడను రుద్దుతారని, గోమూత్రం నుంచి తయారు చేసిన పంచామ్రుతాన్ని ఇస్తారని సుమన్ హరిప్రియ వివరించారు.
Tags: Corona virus, treatment, Cow urine, Cow dung, Suman Haripriya is BJP MLA of Assam