Third wave : డెల్టా ప్లస్ వేరియంట్ కారకం..

ముంబై : మహారాష్ట్రలో మరో నెల లేదా రెండు నెలల్లో థర్డ్ వేవ్ రావొచ్చని, దానికి డెల్టా ప్లస్ వేరియంటే కారణం కావొచ్చని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ అంచనా వేసింది. భౌతిక దూరం, రెండు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తే సెకండ్ వేవ్ ముగియక ముందే మూడో వేవ్ రావొచ్చని తెలిపింది. తొలి వేవ్‌లో 19 లక్షల పేషెంట్లు, సెకండ్ వేవ్‌లో 40 లక్షల మంది కరోనాబారిన పడ్డారని వివరించింది. థర్డ్ వేవ్‌లో ఎనిమిది […]

Update: 2021-06-17 11:33 GMT

ముంబై : మహారాష్ట్రలో మరో నెల లేదా రెండు నెలల్లో థర్డ్ వేవ్ రావొచ్చని, దానికి డెల్టా ప్లస్ వేరియంటే కారణం కావొచ్చని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ అంచనా వేసింది. భౌతిక దూరం, రెండు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తే సెకండ్ వేవ్ ముగియక ముందే మూడో వేవ్ రావొచ్చని తెలిపింది. తొలి వేవ్‌లో 19 లక్షల పేషెంట్లు, సెకండ్ వేవ్‌లో 40 లక్షల మంది కరోనాబారిన పడ్డారని వివరించింది.

థర్డ్ వేవ్‌లో ఎనిమిది లక్షల యాక్టివ్ కేసులను చూసే ముప్పు ఉందని, అందులోనూ పది శాతం పిల్లలే ఉండొచ్చనీ పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు, థర్డ్ వేవ్ సన్నద్ధతపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఈ వివరాలు వెల్లడించింది. థర్డ్ వేవ్‌ను అదుపులో ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉన్నదని, ప్రాథమికంగా తీసుకునే జాగ్రత్తలు విస్మరిస్తే థర్డ్ వేవ్ ముప్పు అంత ఎక్కువ ఉంటుందని టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రాహుల్ పండిత్ వివరించారు.

Tags:    

Similar News