ఏపీలో కోటి దాటిన కరోనా టెస్టులు..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 54,710 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 620 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,67,683కి చేరింది. కొత్తగా వైరస్ బారినపడి ఏడుగు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,988కు పెరిగింది. తాజాగా 3,787 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మొత్తం రికవరీ కేసుల సంఖ్య 8,52,298కు […]

Update: 2020-11-29 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 54,710 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 620 మందికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,67,683కి చేరింది. కొత్తగా వైరస్ బారినపడి ఏడుగు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,988కు పెరిగింది. తాజాగా 3,787 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, మొత్తం రికవరీ కేసుల సంఖ్య 8,52,298కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 8,397గా ఉన్నాయి. కాగా ప్రభుత్వం మొదటినుంచి రాష్ట్రంలో కరోనా టెస్టులు పెద్ద సంఖ్యలో నిర్వహిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా టెస్ట్‌ల సంఖ్య లక్షల్లోనే ఉండగా… తాజా టెస్టులతో కలిపి ఏపీలో టెస్టుల సంఖ్య కోటి దాటేసింది. ఆదివారం విడుదల చేసిన కరోనా బులిటెన్ వివరాల ప్రకారం… రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,00,17,126 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది.

Tags:    

Similar News