అసదుద్దీన్ ఓవైసీకి కరోనా టెస్ట్..

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్​లోని నిజామియా ఏరియా ఆసుపత్రిలో శనివారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో నెగెటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, పాతబస్తీ ప్రజలు కరోనా టెస్టులు చేయించుకునేందుకు అవగాహనలో భాగంగానే తాను యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నట్లు అసద్ వివరించారు. పాతబస్తీలో 30కి పైగా యాంటీజెన్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, ప్రజలు భయపడకుండా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.అనంతరం నిజామియా ఆస్పత్రిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు […]

Update: 2020-07-11 04:40 GMT
అసదుద్దీన్ ఓవైసీకి కరోనా టెస్ట్..
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్​లోని నిజామియా ఏరియా ఆసుపత్రిలో శనివారం కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో నెగెటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, పాతబస్తీ ప్రజలు కరోనా టెస్టులు చేయించుకునేందుకు అవగాహనలో భాగంగానే తాను యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నట్లు అసద్ వివరించారు. పాతబస్తీలో 30కి పైగా యాంటీజెన్ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, ప్రజలు భయపడకుండా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.అనంతరం నిజామియా ఆస్పత్రిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యాలను ఎంపీ పరిశీలించారు. కొవిడ్​ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Tags:    

Similar News