Kallakkadal : కేరళ, తమిళనాడుకు ముంచుకొస్తున్న భారీ ముప్పు
కేరళ(Kerala), తమిళనాడు(Tamil nadu) తీరాలకు భారీ ముప్పు ముంచుకొస్తుంది.
దిశ, వెబ్ డెస్క్ : కేరళ(Kerala), తమిళనాడు(Tamil nadu) తీరాలకు భారీ ముప్పు ముంచుకొస్తుంది. "కల్లక్కడల్"(Kallakkadal) రెండు రాష్ట్రాల తీర ప్రాంతాలను ముంచివేయనుందని కేంద్రప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 15న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో ఉప్పెన మాదిరిగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరికల్లో పేర్కొంది. 1 మీటరు వరకు అలల తాకిడి ఉంటుందని, సముద్ర ఉప్పెన ముప్పు కూడా ఉండే అవకాశం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసీయన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(INCOIS) తెలిపింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల తీరప్రాంతాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులు చేపలవేట(Fishing)కు వెళ్లకూడదని, బీచ్ లు అన్నీ మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
'కల్లక్కడల్' అంటే..
కల్లక్కడల్ అంటే సముద్రపు దొంగలా దూసుకు రావడం. ఇది సముద్రంలో వచ్చే ఆకస్మిక మార్పు. హిందూ మహాసముద్రంలోని సౌత్ లో వీచే కొన్ని బలమైన గాలుల వలన ఇలా సముద్రం ఉప్పొంగుతుంది. అయితే ఇది సునామీ కాదని, దీని ప్రభావం రెండు రోజుల వరకు ఉండవచ్చు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా సముద్రం దూసుకురావడం వల్ల దీనిని కల్లక్కడల్ అంటారు.