Mahesh Kumar Goud: కేసీఆర్ కౌశిక్ రెడ్డిని అదుపులో పెట్టుకో: పీసీసీ చీఫ్
కౌశిక్ రెడ్డి తీరుపై మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy) పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, ఆయన్ను కేసీఆర్ అదుపులో ఉంచుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సూచించారు. కౌశిక్‌రెడ్డి తీరును తెలంగాణ ప్రజలు అంగీకరించన్నారు. కొంపల్లి దేవరయాంజాల్‌లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా చానల్‌తో మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. దాడులు, దురుసు ప్రవర్తన తెలంగాణ సంస్కృతి కాదని, కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) మెప్పుకోసం కౌశిక్‌రెడ్డి ఈ రకంగా వ్యవహరించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్, కేటీఆర్ అదుపుచేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు క్రమశిక్షణ అవసరమని, ఇకనైనా కౌశిక్‌రెడ్డి తన తీరు మార్చుకోవాలన్నారు. ఈ రకమైన ప్రవర్తనతో రాజకీయంగా ఎదుగుతామనుకోవడం అవివేకమేనని అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రవర్తన ఎవరు చేసిన ఉపేక్షించొద్దన్నారు.