వేశ్యకు కరోనా.. టెన్షన్‌లో ఆ పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఓ హోటల్‌లో దాడులు చేసిన పోలీసులకు కరోనా భయం పట్టుకుంది. విధి నిర్వహణకు పోతే కరోనా కూడా వెంటొచ్చిందని ఆ పోలీసులు తలలు పట్టుకున్నారు. వివరాళ్లోకి వెళితే.. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని రామ్‌లఖాన్ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో.. జులై 1న డీఎస్పీ చెట్నా భాటి ఆధ్వర్యంలోని పోలీసు బృందం పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ దాడుల్లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న నలుగురు యువకులతో పాటు.. వ్యభిచారానికి పాల్పడ్డ 7 […]
దిశ, వెబ్‌డెస్క్: సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఓ హోటల్‌లో దాడులు చేసిన పోలీసులకు కరోనా భయం పట్టుకుంది. విధి నిర్వహణకు పోతే కరోనా కూడా వెంటొచ్చిందని ఆ పోలీసులు తలలు పట్టుకున్నారు. వివరాళ్లోకి వెళితే.. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని రామ్‌లఖాన్ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో.. జులై 1న డీఎస్పీ చెట్నా భాటి ఆధ్వర్యంలోని పోలీసు బృందం పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ దాడుల్లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న నలుగురు యువకులతో పాటు.. వ్యభిచారానికి పాల్పడ్డ 7 గురు వేశ్యలు, విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, హోటల్‌పై దాడులు నిర్వహించిన పోలీసులందరూ ఓ వార్త విని ఖంగుతిన్నారు. వారు అరెస్ట్ చేసిన వారిలో ఢిల్లీకి చెందిన ఓ యువతికి కరోనా వైరస్ ఉందని గుర్తించిన అధికారులకు ఊహించని షాక్ తగిలింది. ఆ యువతిని అరెస్ట్ చేసిన సమయంలో 4 మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అక్కడి ఉన్నతాధికారలు.. రైడ్ చేసిన పోలీసులు, వారి ప్రైమరీ కాంటాక్టు వివరాలను సేకరించారు. అనంతరం వారిని క్వారన్‌టైన్ కేంద్రాలకు తరలించారు.