ఆ ఖతార్ 37 మంది ఉత్తరాంధ్రులే..!
ఖతార్ నుంచి ముంబై వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని క్వారంటైన్ ముగియకుండానే ముంబై నుంచి ప్రైవేటు బస్సులో హైదరాబాదు వస్తూ సంగారెడ్డి జిల్లాలో పట్టుబడిన 37 మంది ఉత్తరాంధ్ర వాసులుగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారంతా జీవనోపాధి కోసం ఖతార్ వెళ్లారు. కరోనా భయం ప్రబలుతున్న వేళ ఖతార్ నుంచి వచ్చారు. ఖతార్ నుంచి ఇంటికి వెళ్లిపోదామన్న ఆలోచనతో ప్రైవేటు బస్సును ఆశ్రయించారు. వారందర్నీ మళ్లీ గచ్చిబౌలిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. క్వారంటైన్ గడువు ముగిసిన […]
ఖతార్ నుంచి ముంబై వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని క్వారంటైన్ ముగియకుండానే ముంబై నుంచి ప్రైవేటు బస్సులో హైదరాబాదు వస్తూ సంగారెడ్డి జిల్లాలో పట్టుబడిన 37 మంది ఉత్తరాంధ్ర వాసులుగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారంతా జీవనోపాధి కోసం ఖతార్ వెళ్లారు. కరోనా భయం ప్రబలుతున్న వేళ ఖతార్ నుంచి వచ్చారు. ఖతార్ నుంచి ఇంటికి వెళ్లిపోదామన్న ఆలోచనతో ప్రైవేటు బస్సును ఆశ్రయించారు.
వారందర్నీ మళ్లీ గచ్చిబౌలిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. క్వారంటైన్ గడువు ముగిసిన తరువాతే వారిని ఇళ్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆ బస్సులో ప్రయాణించిన వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. మరో ఘటనలో హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన మహిళను బంధువులు ఇంటికి పంపేశారు. దీంతో ఆమెను గుర్తించి క్వారంటైన్‌కు పంపారు. ఇంకో ఘటనలో సిడ్నీ నుంచి ఇటీవల ఏలూరు వచ్చిన ఓ వ్యక్తి హోం క్వారంటైన్ పూర్తికాకుండానే కర్ణాటక సంపర్క్‌క్రాంతి రైలెక్కేశాడు. సికింద్రాబాద్ రైల్వే కంట్రోలర్ సమాచారంతో భువనగిరిలో అతడిని దింపిన పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు.
మరో ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన కాకినాడ మహిళ రైలులో వెళ్తుండగా ఆమె చేతిపై ఉన్న క్వారంటైన్ ముద్ర చూసిన తోటి ప్రయాణికులు అప్రమత్తమైన సికింద్రాబాద్ పోలీసులు ఆమెను దించేశారు. మరో ఘటనలో నైజీరియా నుంచి ఈ నెల 20న ముంబైకి చేరుకున్న యూపీ వ్యక్తిపై అధికారులు క్వారంటైన్ ముద్ర వేశారు. అతడు యూపీ వెళ్లకుండా ముంబై ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ చేరుకున్నాడు. అతడ్ని గుర్తించి గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు పంపారు.
Tags: corona, srikakulam districts, quarantain, travelling,