కరోనా… 177 దేశాలు.. 9,800 మృతులు
మహమ్మారి కరోనా 177 దేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా 2,20,313 మందికి వైరస్ సోకగా, 9,800 మంది మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. వైరస్ పుట్టిన చైనాలో దాని ప్రభావం తగ్గగా, ఇటలీలో మారణ హోమం స్పష్టిస్తోంది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 3,500 దాటింది. ఇది చైనా కంటే అధికంగా ఉండటం గమనార్హం. గురువారం ఒక్కరోజే ఇటలీలో 427 మంది, స్పెయిన్‌లో 165, ఇరాన్‌లో 149 మంది చనిపోయారు. అయితే చైనాలో కరోనా పూర్తిగా నియంత్రణలోకి […]
మహమ్మారి కరోనా 177 దేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా 2,20,313 మందికి వైరస్ సోకగా, 9,800 మంది మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. వైరస్ పుట్టిన చైనాలో దాని ప్రభావం తగ్గగా, ఇటలీలో మారణ హోమం స్పష్టిస్తోంది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 3,500 దాటింది. ఇది చైనా కంటే అధికంగా ఉండటం గమనార్హం. గురువారం ఒక్కరోజే ఇటలీలో 427 మంది, స్పెయిన్‌లో 165, ఇరాన్‌లో 149 మంది చనిపోయారు. అయితే చైనాలో కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది. గురువారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
Tags: corona, china, italy, world wide, india