కరోనా పోవాలని.. ఆ దేవతలకు పూజలు
దిశ,మహబూబాబాద్ : కరోనా అంతం కావాలని ఇప్పటికే చాలా ప్రదేశాల్లో పూజల నిర్హహించిన విషయం తెలిసిందే. ఇంక కొంత మందైతే మట్టితో కరోనా బొమ్మ చేసి పూజలు చేశారు మరికొంత మంది ఏకంగా మేకపోతులను బలిచ్చారు. ఇలా ఒక్కో ప్రదేశంలో ఒకలా కరోనా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడం మండలంలోని జంగవానిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్, ఎర్రవరం, కుందన పల్లి, సరసనపల్లి గ్రామాల్లో బుధవారం కరోనా వైరస్ అంతం కావాలని గ్రామదేవతలకు […]
దిశ,మహబూబాబాద్ : కరోనా అంతం కావాలని ఇప్పటికే చాలా ప్రదేశాల్లో పూజల నిర్హహించిన విషయం తెలిసిందే. ఇంక కొంత మందైతే మట్టితో కరోనా బొమ్మ చేసి పూజలు చేశారు మరికొంత మంది ఏకంగా మేకపోతులను బలిచ్చారు. ఇలా ఒక్కో ప్రదేశంలో ఒకలా కరోనా పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడం మండలంలోని జంగవానిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్, ఎర్రవరం, కుందన పల్లి, సరసనపల్లి గ్రామాల్లో బుధవారం కరోనా వైరస్ అంతం కావాలని గ్రామదేవతలకు సంప్రదాయ పద్దతిలో అభిషేకాలు నిర్వహించారు. పసుపు, కుంకుమ వేప ఆకులు, మామిడాకులతో అలంకరణ చేశారు. ఆయా గ్రామాల మహిళలు బిందెలో నీళ్లు తెచ్చి బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తితో గ్రామీణ జీవనం చిన్నాభిన్నమైనదని వాపోతున్నారు. ఈ వైరస్ పూర్తిగా అంతం కావాలని పూజలు చేసినట్లు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు అందరూ వనబోజనాలను వనభోజనాలకు తరలివెళ్లారు.