ముక్కంటి దర్శనానికి బ్రేక్.. అర్చకుడికి కరోనా
దిశ, ఏపీ బ్యూరో: ముక్కంటి కొలువై ఉన్న శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనాలకు అంతా సిద్ధమైన తరుణంలో బ్రేక్ పడింది. ఆలయంలోని అర్చకుడికి కరోనా సోకడంతో ఆలయ దర్శనాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మొత్తం 71 మంది ఆలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఒక అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంకా మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో ఈ నెల 12 నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించాలన్న నిర్ణయం వాయిదా వేశారు. దీనిపై ఆలయ ఈవో […]
దిశ, ఏపీ బ్యూరో: ముక్కంటి కొలువై ఉన్న శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనాలకు అంతా సిద్ధమైన తరుణంలో బ్రేక్ పడింది. ఆలయంలోని అర్చకుడికి కరోనా సోకడంతో ఆలయ దర్శనాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మొత్తం 71 మంది ఆలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఒక అర్చకుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంకా మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో ఈ నెల 12 నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించాలన్న నిర్ణయం వాయిదా వేశారు. దీనిపై ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకూ శ్రీకాళహస్తి ఆలయంలోకి భక్తులను అనుమతించబోమని ప్రకటించారు.