డెలివరీకి వచ్చిన గర్భిణీకి కరోనా.. డాక్టర్లు ఏం చేశారో తెలుసా..?
దిశ, గోదావరిఖని: గోదావరిఖని శారదానగర్‌లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. కరోనా సోకిన మహిళకు డెలివరీ చేశారు. పాపకు జన్మనివ్వడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. సూర్యనగర్‌కు చెందిన ఓ గర్భిణీ మహిళ డెలివరీ కోసం శారదానగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఈ క్రమంలోనే ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అయితే, రిపోర్టులో మాత్రం పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు సర్జరీ చేసి డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా […]
దిశ, గోదావరిఖని: గోదావరిఖని శారదానగర్‌లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. కరోనా సోకిన మహిళకు డెలివరీ చేశారు. పాపకు జన్మనివ్వడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. సూర్యనగర్‌కు చెందిన ఓ గర్భిణీ మహిళ డెలివరీ కోసం శారదానగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఈ క్రమంలోనే ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అయితే, రిపోర్టులో మాత్రం పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్యులు సర్జరీ చేసి డెలివరీ చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యుల చొరవతో బంధువులు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.