కరోనా కేసు అనగానే బెంబేలెత్తిపోయిన గుంటూరు శ్యామలానగర్

గుంటూరులోని శ్యామలానగర్‌లో కరోనా పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తి ఉన్నాడన్న సమాచారంతో మూడుగంటల పాటు బెంబేలెత్తిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. శ్యామలానగర్‌లో కరోనా పాజిటివ్‌ లక్షణాలున్న వ్యక్తి ఉన్నాడంటూ కలెక్టర్‌ ఆగమేఘాల మీద క్షేత్ర స్థాయికి వచ్చారు. ఆయన వెంట జిల్లా యంత్రాంగం పరుగులు తీసింది. దీంతో కాలనీ వాసులు భయపడిపోయారు. ఆ వెంటనే డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లు రంగంలోకి దిగాయి. పెరి మీటర్‌ కంట్రోల్‌ టీమ్‌‌(ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, పోలీసులు)లోని పోలీసులు […]

Update: 2020-03-24 02:53 GMT

గుంటూరులోని శ్యామలానగర్‌లో కరోనా పాజిటివ్ లక్షణాలున్న వ్యక్తి ఉన్నాడన్న సమాచారంతో మూడుగంటల పాటు బెంబేలెత్తిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. శ్యామలానగర్‌లో కరోనా పాజిటివ్‌ లక్షణాలున్న వ్యక్తి ఉన్నాడంటూ కలెక్టర్‌ ఆగమేఘాల మీద క్షేత్ర స్థాయికి వచ్చారు. ఆయన వెంట జిల్లా యంత్రాంగం పరుగులు తీసింది. దీంతో కాలనీ వాసులు భయపడిపోయారు.

ఆ వెంటనే డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌లు రంగంలోకి దిగాయి. పెరి మీటర్‌ కంట్రోల్‌ టీమ్‌‌(ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, పోలీసులు)లోని పోలీసులు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించిన ప్రదేశం నుంచి మూడు కిలో మీటర్ల రేడియస్ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంత పరిధిలోని ఏ ఒక్కరిని బయటకు లేదా బయటి నుంచి లోపలికి అనుమతి చలేదు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.

ఆ పరిసరాల్లోని హోటళ్లను మూసేయించారు. ఇంతలో హౌస్‌ హోల్డ్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ కరోనా లక్షణాలు ఉన్న బాధితుడిని గుర్తించాయి. వెంటనే అతనిని చేరుకుని, అతడు ప్రయాణించిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తుల వివరాలను సేకరించి, అతనిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఎక్కించారు. క్వారంటైన్‌ టీమ్‌ ఆ ప్రాంతంలో దగ్గు, జలుబు లక్షణాలతో బాధపడుతున్న వారి నుంచి శాంపిల్స్‌ సేకరించాయి.

ఆ ఏరియా మొత్తం పారిశుద్ధ్య డ్రైవ్‌ చేపట్టారు. ఈ తతంగమంతా ముగియగానే వారంతా చప్పట్లు కొట్టారు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. మాక్‌ డ్రిల్‌ సక్సెస్‌ సిబ్బంది హర్షద్వానాలు చేశారు. అప్పటి వరకు కరోనా భయంతో బెంబేలెత్తిపోయిన ప్రజలు మాక్ డ్రిల్లా? అంటూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

Tags: andhra pradesh, guntur, syamala nagar, mock drill, corona mock drill, collector, police, doctors

Tags:    

Similar News