నిజామాబాద్ ప్రభుత్వ హాస్టల్‌లో కరోనా కలకలం

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఓ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినికి కరోనా సోకింది. గురువారం హాస్టల్‌లో 152 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4వ తరగతి విద్యార్థినికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. కాగా, అంతకుముందు రోజు ఇదే హాస్టల్ అనుబంధంగా ఉన్న స్కూల్ టీచర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం, వైద్య సిబ్బందితో పరీక్షలు నిర్వహించగా విద్యార్థినికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని హాస్టల్ అధికారులు […]

Update: 2021-12-03 05:25 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఓ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినికి కరోనా సోకింది. గురువారం హాస్టల్‌లో 152 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4వ తరగతి విద్యార్థినికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. కాగా, అంతకుముందు రోజు ఇదే హాస్టల్ అనుబంధంగా ఉన్న స్కూల్ టీచర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం, వైద్య సిబ్బందితో పరీక్షలు నిర్వహించగా విద్యార్థినికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని హాస్టల్ అధికారులు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేశారు. కాగా, విద్యార్థినికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఒకే ప్రాంతంలో రెండు హాస్టళ్ళు ఉండగా ఒక హాస్టల్ విద్యార్థినికి కరోనా రావడంతో మరో హాస్టల్ విద్యార్థినులు కూడా టెస్టులకు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News