కొంప ముంచిన హరితహారం.. జడ్పీ చైర్మన్‌కు కరోనా

దిశ, ఇల్లందు: తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిన నాటి నుంచి కరోనా అదుపులోకి వచ్చిన… సెకండ్ వేవ్ మాత్రం కొనసాగుతూనే ఉంది . ఈ క్రమంలో వైరస్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతుంది. కానీ, రోజు దాదాపు వెయ్యి మందికి పైగా వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో సామాన్యులతో పాటు ప్రముఖులు ఉన్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య కరోనా బారిన […]

Update: 2021-07-15 21:19 GMT

దిశ, ఇల్లందు: తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిన నాటి నుంచి కరోనా అదుపులోకి వచ్చిన… సెకండ్ వేవ్ మాత్రం కొనసాగుతూనే ఉంది . ఈ క్రమంలో వైరస్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతుంది. కానీ, రోజు దాదాపు వెయ్యి మందికి పైగా వైరస్ బారిన పడుతున్నారు. ఇందులో సామాన్యులతో పాటు ప్రముఖులు ఉన్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య కరోనా బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా హరితహారం , పినపాక నియోజకవర్గం‌లో మంత్రులతోపాటు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కోరం కనకయ్య కరోనా అనుమానిత లక్షణాలైన జ్వరం, దగ్గు ,జలుబు ఉండడంతో టెస్ట్ చేయించుకున్న జడ్పీ చైర్మన్‌కు శుక్రవారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో గత రెండు రోజులుగా తనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కరోనా టెస్ట్ చేయించుకోవాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య కోరారు.

Tags:    

Similar News