స్కూల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ !

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న తరుణంలో స్కూల్ విద్యార్థులకు పాజిటివ్‌ వస్తుండటం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ స్కూళ్ల విద్యార్థులు, టీచర్లకు పాజిటివ్ ​లక్షణాలు బయటపడ్డాయి. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, టీచర్‍కు లక్షణాలు కనిపించాయి. త్రిపురాంతకం హైస్కూల్లో ఉపాధ్యాయుడికి పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. పీసీపల్లి హైస్కూల్లో ఓ విద్యార్థి, ఉపాధ్యాయుడికి పాజిటివ్ ​వచ్చింది. పెద్దగొల్లపల్లి హైస్కూల్లో మరో ఉపాధ్యాయుడికి పాజిటివ్ ​అని తెలియడంతో […]

Update: 2020-11-04 10:20 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్న తరుణంలో స్కూల్ విద్యార్థులకు పాజిటివ్‌ వస్తుండటం కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ స్కూళ్ల విద్యార్థులు, టీచర్లకు పాజిటివ్ ​లక్షణాలు బయటపడ్డాయి. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, టీచర్‍కు లక్షణాలు కనిపించాయి. త్రిపురాంతకం హైస్కూల్లో ఉపాధ్యాయుడికి పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. పీసీపల్లి హైస్కూల్లో ఓ విద్యార్థి, ఉపాధ్యాయుడికి పాజిటివ్ ​వచ్చింది. పెద్దగొల్లపల్లి హైస్కూల్లో మరో ఉపాధ్యాయుడికి పాజిటివ్ ​అని తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై డీఈవో కార్యాలయంలో కంట్రోలు రూం ఏర్పాటు చేశారు.

చిత్తూరు జిల్లాలో బుధవారం 17,549మంది టీచర్లు, 3,503మంది విద్యార్థులకు కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా 187 మంది టీచర్లు, 13మంది విద్యార్థులకు పాజిటివ్​గా తేలింది. జిల్లాలోని మొత్తం 662పాఠశాలల్లో కొవిడ్ ​పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, గుడివాడ మండలం మోటూరులో ఇద్దరు టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నమోదయింది.

Tags:    

Similar News