ఏపీలో 8లక్షల 80వేలు దాటిన కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 59,551మందికి పరీక్షలు నిర్వహించగా 357మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,80,075కు చేరింది. నలుగురు చనిపోవడతో మొత్తం మృతుల సంఖ్య 7,089గా ఉంది. ప్రస్తుతం 3,862 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,69,124మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 355మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,14,74,797మందికి కరోనా శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. అనంతపురం జిల్లాలో 27 […]

Update: 2020-12-24 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 59,551మందికి పరీక్షలు నిర్వహించగా 357మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,80,075కు చేరింది. నలుగురు చనిపోవడతో మొత్తం మృతుల సంఖ్య 7,089గా ఉంది. ప్రస్తుతం 3,862 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,69,124మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 355మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,14,74,797మందికి కరోనా శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 54, తూర్పుగోదావరిలో 58, గుంటూరులో 42, కడపలో 14, కృష్ణా జిల్లాలో 54, కర్నూలులో 9, నెల్లూరులో 28, ప్రకాశంలో 9, శ్రీకాకుళంలో 16, విశాఖపట్నంలో 28, విజయనగరంలో 4, పశ్చిమగోదావరి జిల్లాలో 14 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News