ఏపీలో కొత్తగా 500 కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 61,452మందికి పరీక్షలు నిర్వహించగా 500మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,76,336కు చేరింది. ఐదుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,064కు చేరింది. ప్రస్తుతం 4,660 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,64,612మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 563మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 1,09,37,377మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. అనంతపురం జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో […]

Update: 2020-12-15 06:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 61,452మందికి పరీక్షలు నిర్వహించగా 500మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,76,336కు చేరింది. ఐదుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7,064కు చేరింది. ప్రస్తుతం 4,660 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,64,612మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 563మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 1,09,37,377మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 88, తూర్పుగోదావరిలో 47, గుంటూరులో 55, కడపలో 34, కృష్ణాలో 77, కర్నూలులో 9, నెల్లూరులో 22, ప్రకాశంలో 26, శ్రీకాకుళంలో 21, విశాఖపట్నంలో 20, విజయనగరంలో 19, పశ్చిమగోదావరిలో 63 కేసులు వచ్చాయి. కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Tags:    

Similar News