ఏపీలో కరోనా @ 1463
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ రోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అర్ధ సెంచరీ దాటేసింది. ఏపీలో కరోనా వివరాలను వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 7,902 మంది కరోనా అనుమానితుల శాంపిళ్లను పరీక్షించగా 60 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,463కి చేరుకుందని వెల్లడించింది. కర్నూలు జిల్లాను కరోనా వదలడం లేదు. నిన్న, నేడు కూడా కర్నూలు జిల్లాలోనే […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ రోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అర్ధ సెంచరీ దాటేసింది. ఏపీలో కరోనా వివరాలను వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 7,902 మంది కరోనా అనుమానితుల శాంపిళ్లను పరీక్షించగా 60 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1,463కి చేరుకుందని వెల్లడించింది.
కర్నూలు జిల్లాను కరోనా వదలడం లేదు. నిన్న, నేడు కూడా కర్నూలు జిల్లాలోనే భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం విశేషం. నిన్న కర్నూలులో 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కేసుల సంఖ్య 411కి చేరుకుంది. వీరిలో 335 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక వ్యక్తి కరోనా కారణంగా మృతిచెందడంతో ఈ జిల్లాలో ఇప్పటి వరకు 10 మంది మరణించారు. చికిత్సతో కోలుకుని 66 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఆ తరువాతి స్థానంలో గుంటూరు కొనసాగుతోంది. ఈ జిల్లాలో నిన్న 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ కేసుల సంఖ్య 306కి చేరుకుంది. 201 మంది చికిత్స పొందుతుండగా, 97 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం, కడప జిల్లాల్లో 6 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.
దీంతో ఏపీలో ఇప్పటి వరకు 1463 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే.. వారిలో 1027 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడి చికిత్స పొందడంతో కోలుకుని 403 మంది డిశ్చార్జ్ కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33 మంది మరణించారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది.
Tags: coronavirus, ap, covid-19, ap health department